Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Dec-2014 11:18:30
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ నటించే తదుపరి చిత్రం షూటింగ్ ఇక కొత్త సంవత్సరంలోనే సెట్స్ కి వెళుతుంది. 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా తర్వాత కథల ఎంపిక విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీను వైట్ల తయారుచేసిన పవర్ ఫుల్ సబ్జెక్టుకి ఇటీవలే పచ్చజెండా ఊపాడు. ప్రస్తుతం దీని స్క్రిప్ట్ వర్క్ జోరుగా నడుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నెలలో మొదలవ్వచ్చని సమాచారం. మరోపక్క, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించే చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇది వచ్చే ఏడాది వేసవిలో సెట్స్ కి వెళుతుందని అంటున్నారు.

,  ,  ,  ,  ,