Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Dec-2016 12:02:00
facebook Twitter Googleplus
Photo

ఆల్రెడీ రామ్ చరణ్ సినిమా మూడు వారాల కిందటే రిలీజైంది. అతడి తర్వాతి సినిమా ఇంకా మొదలే కాలేదు. మరి జనవరి 7న రామ్ చరణ్ సినిమా రిలీజవ్వడమేంటి అంటారా..? ఇక్కడ మాట్లాడుతోంది తెలుగులో చరణ్ సినిమా విడుదల గురించి కాదు. అతడి తమిళ సినిమా రిలీజ్ గురించి. రామ్ చరణ్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన ?తుపాన్? సినిమాను తమిళంలో ?సూపర్ పోలీస్? పేరుతో అనువదించడం విశేషం. ఇది చరణ్ మూడేళ్ల కిందట నటించిన సినిమా. ఇంకేవీ లేనట్లుగా ఈ చిత్రాన్ని ఏరి కోరి తమిళంలోకి అనువాదం చేశారు. ఈ చిత్రం జనవరి 7న విడుదలవుతోంది.

తెలుగు సినిమాల్ని తమిళంలోకి అనువాదం చేసి రిలీజ్ చేయడంలో పెద్ద చరిత్ర ఉన్న ?భద్రకాళి ఫిలిమ్స్? సంస్థ ?తుపాన్?ను ?సూపర్ పోలీస్? పేరుతో డబ్ చేసింది. సంక్రాంతికి భారీ సినిమాలతో కోలీవుడ్ జనాలు రెడీ అవుతుండగా.. ముందు వారం చరణ్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. గత ఏడాది ?బ్రూస్ లీ? సినిమాను కూడా తమిళంలోకి అనువాదం చేసి రిలీజ్ చేసింది ?భద్రకాళి ఫిలిమ్స్?. ఫలితం నిరాశాజనకమే. అయినా చరణ్ సినిమాల్లో పెద్ద డిజాస్టర్ అయిన సినిమాను తమిళంలోకి అనువాదం చేశారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒకప్పటి క్లాసిక్ ?జంజీర్?కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో చరణ్ సరసన ప్రియాంక చోప్రా కథానాయికగా నటించింది.

,  ,  ,  ,  ,  ,  ,