Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jan-2017 10:50:16
facebook Twitter Googleplus
Photo

ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్.. రిలీజ్ పనుల్లో ప్రొడ్యూసర్ రామ్ చరణ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు ప్రమోషన్స్ హ్యాండిల్ చేస్తూనే.. మరోవైపు తన సినిమా సంగతులు కూడా చెప్పేస్తున్నాడు. సాధారణంగా మన స్టార్ హీరోలు తర్వాత చేయబోయే ఒక సినిమా తేల్చుకోడానికే నాలుగైదు నెలలు చేస్తుంటారు. కానీ రామ్ చరణ్ మాత్రం.. తాను ఇప్పటికే మూడు సినిమాలు సైన్ చేశానని చెప్పి ఆశ్చర్యపరిచాడు.

బాలీవుడ్ ఆలోచనలు ప్రస్తుతం లేవు.. తెలగులో సుకుమార్.. కొరటాల కాకుండా మరో మూవీ సైన్ చేశానని చెప్పాడు చెర్రీ. సుకుమార్ తో సినిమా ఈ నెలాఖరుకు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. తర్వాతి సినిమా ఎవరితో అన్నదే పాయింట్. కొరటాలతో సినిమా అని మొన్నటివరకు అనుకున్నా.. ఇప్పుడది కష్టం. ఎందుకంటే శివ తన తర్వాతి మూవీగా మహేష్ 25 చేయబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా జరుగుతున్నాయి. మరి ఆ రెండో మూవీ ఎవరిదా అనే సందేహానికి ఆన్సర్ దొరకడం లేదు. ఇన్నాళ్లు త్రివిక్రమ్ పేరు వినిపించింది కానీ.. అది కూడా కష్టమే. పవన్ తో సినిమా తర్వాత త్రివిక్రమ్-ఎన్టీఆర్ ల సినిమా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. త్రివిక్రమ్-మహేష్ ల ప్రాజెక్టు కూడా పట్టాలపైకి ఎక్కాల్సి ఉంది. మరి ఇప్పుడు సుకుమార్ తో సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ ఎవరితో మూవీ చేయనున్నాడనే అంశం పెద్ద సస్పెన్స్ అయిపోయినప్పుడు.. ఇక మూడో మూవి ఎవరితో చేస్తున్నాడంటారూ? ఇది ఇంకా పెద్ద సస్పెన్సే.

ఆ మధ్యన మణిరత్నం కథ చెప్పినా.. ఆ సినిమా ఇంకా ఓకె కాలేదని ధృవ ప్రమోష్ టైములో చరణే చెప్పాడు. అలాగే గౌతమ్ మీనన్ తో ఒక సినిమా అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ సుక్కూ తరువాత గౌతమ్ మీనన్ తో చేస్తున్నాడంటారా? సరే ఒకటి గౌతమ్ తో అనుకుందాం.. ఇంకోటి ఎవరితో? ఎవరన్నా యంగ్ డైరక్టర్ కథ ఏదన్నా నచ్చేసిందంటారా? లెటజ్ సీ.

,  ,  ,  ,  ,