Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2016 15:07:23
facebook Twitter Googleplus
Photo

తప్పు చేయడం కాదు.. ఆ తప్పును తెలుసుకోవడం గొప్ప విషయం. ఆ తప్పును ఒప్పుకోవడం చాలా గొప్ప అనాల్సిందే. నిజానికి ఇలాంటివేవీ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డిక్షనరీలో ఉండవు. నాకు తెలిసింది చేస్తా నాకు నచ్చింది తీస్తా.. ఇలా ఉంటాయ్ వర్మ చెప్పే సంగతులు. కానీ ఎందుకో సడెన్ గా రూట్ మార్చేసి.. తన సినిమాల ఫ్లాప్ అవడానికి తనే ఓ రీజన్ చెప్పేశాడు.

సహజంగా వర్మ చాలా తొందరగా సినిమాలు చుట్టేస్తుంటాడు. ఈయన మూవీస్ ఫ్లాప్ అవడానికి జనాలకు ఎక్కకపోడానికి ఈ తొందరపాటే కారణం అంటారు చాలామంది. అయితే.. ఇది కరెక్ట్ కాదన్నది వర్మ వాదన. డిపార్ట్ మెంట్ - ఆగ్ వంటి చిత్రాలకు చాలానే సమయం తీసుకుని చేసినా ఆడలేదుగా అంటున్నాడీ దర్శకుడు. సర్కార్ సినిమాను అయితే కేవలం 30 రోజుల్లో తీసినా సూపర్ హిట్ అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నాడు.

తను ఓ అడవి గుర్రంలాంటి వాడినని.. ఆ ఆటవికతను అణిచేస్తే.. తను తీసే సినిమాల్లో విభిన్నత కూడా చచ్చిపోతుందని చెప్పిన వర్మ.. తన సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణం కేవలం తన పొగరు తప్ప వేరే ఏ రీజన్ లేదని తేల్చేశాడు. అయితే.. గత రెండేళ్లలో ఆరు సినిమాలకు స్క్రిప్టులు రెడీ చేసేశాడట. వందలకొద్దీ ఇంగ్లీష్ సినిమాలు చూసేసి ఫుల్ హుషారు కూడా తెచ్చేసుకున్నానని చెప్పిన రామ్ గోపాల్ వర్మ.. ఇకపై పొగరు అతి నమ్మకం లాంటి తప్పులను సరిచేసుకుని సినిమాలు తీస్తానంటున్నాడు. మరి ఈ మాటలపై వర్మ ఎన్నాళ్లు నిలబడతాడో చూడాలి.

,  ,  ,  ,  ,  ,