Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jun-2015 10:56:30
facebook Twitter Googleplus
Photo

శ్రీనువైట్ల దర్శకత్వంలో రాంచరణ్ .. రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తోన్న సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. నిన్నమొన్నటి వరకూ విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ - శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి చేస్తోంది. చరణ్ తో పాటు ప్రధాన పాత్రధారులకి మధ్య కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ తెరకెక్కిస్తున్నారు.

డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నదియా .. కృతి కర్బందా ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. శ్రీనువైట్ల మార్కు కామెడీ ఎపిసోడ్స్ తో పాటు, చరణ్ నుంచి అభిమానులు ఆశించే యాక్షన్ సీన్స్ .. ఆకట్టుకునే స్టెప్పులు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. తమన్ బాణీలను కూర్చిన ఈ సినిమా సాధ్యమైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకి రావడానికి ప్రయత్నిస్తోంది.

,  ,  ,  ,