Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Dec-2017 10:27:11
facebook Twitter Googleplus
Photo

తారలకు కోట్లల్లో అభిమానులుంటారు. వాళ్లు ఎక్కడైనా కనిపిస్తే ఒక ఫొటో దిగుదామని ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. అంతటి ఫాలోయింగ్ ఉన్న సినీ తారలకు కూడా క్రీడాకారులకు పెద్ద అభిమానులై ఉంటారు. ముఖ్యంగా క్రికెటర్లను సినీ తారలు చాలా అభిమానిస్తారు. వాళ్లు కలిసినపుడు వీళ్లు ఫ్యాన్స్ అయిపోతుంటారు. ఆ సందర్భాల్ని కెమెరాలోకి బంధిస్తుంటారు.

సీనియర్ నటి రమ్యకృష్ణ సైతం ఇలాగే ఫ్యాన్ మూమెంట్ ను ఆస్వాదించింది. ఓ నేషనల్ టీవీ ఛానెల్.. ప్రతి ఏడాది వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు అవార్డులిస్తుంది. ఈ ఏడాది ఎంటర్టైన్మెంట్ రంగంలో రమ్యకృష్ణకు అవార్డు దక్కగా.. కోహ్లి ఓవరాల్ గా ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ అవార్డుల వేడుకకు రమ్యకృష్ణతో పాటు కోహ్లి కూడా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా కోహ్లితో కలిసి ఫొటో దిగిన రమ్య.. దాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. విరాట్ కోహ్లి మంచి వ్యక్తి అని.. అతడిని కలుసుకోవడం తనకు చాలా సంతోషంగా ఉందని రమ్యకృష్ణ తెలిపింది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాహుబలి లో శివగామి పాత్రకు గాను రమ్యకృష్ణ అవార్డు అందుకుంది.

,  ,  ,  ,