Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Dec-2017 12:43:10
facebook Twitter Googleplus
Photo

అఖిల్ లేటెస్ట్ మూవీ హలో ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. కొడుకును హీరోగా నిలబెట్టేందుకు అవసరమైన కమర్షియల్ సక్సెస్ ఇచ్చేందుకు నాగార్జున ఈ సినిమా విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. డైరెక్టర్ ను ఎంపిక చేయడం మొదలు సినిమా టైటిల్ వరకు ప్రతి విషయం దగ్గరుండి చూసుకున్నాడు. ఈ సినిమాపై మాక్సిమం బజ్ క్రియేటయ్యేలా చూడటంలో సక్సెస్ సాధించాడు.

హలో మూవీలో హీరో అఖిల్ కు తల్లిగా రమ్యకృష్ణ నటించింది. బాహుబలి సినిమాలో శివగామి క్యారెక్టర్ తో తల్లి పాత్ర ఎంత అద్భుతంగా చేయగలదో రమ్యకృష్ణ నిరూపించింది. హలో సినిమాలోనూ అఖిల్ మదర్ క్యారెక్టర్ కు రమ్యకృష్ణయే కరెక్ట్ ఛాయిస్ అని నాగార్జున అంటున్నారు. ఈ క్యారెక్టర్ కు ముందు ఇంకొన్ని పేర్లు పరిశీలనలోకి వచ్చినా చివరకు వాటన్నింటని పక్కకు పెట్టేశారు. ఈ క్యారెక్టర్ కు రమ్యకృష్ణ అయితేనే వందశాతం న్యాయం చేస్తుందని నమ్మి ఆమెను ఎంపిక చేసుకున్నాడు. అఖిల్ తండ్రి పాత్రను ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రలతో దూసుకుపోతున్న జగపతిబాబు చేశాడు.

హలో సినిమా మెయిన్ గా లవ్ స్టోరీయే అయినా ఎమోషన్ సీన్స్ ను తనను బాగా కదిలించి వేశాయని మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చారు. అమ్మా అంటూ అఖిల్ చెప్పే డైలాగ్ ఓ రకంగా కంట తడి పెట్టించిందని కూడా చెప్పారు. అంత ఎమోషనల్ ఎలిమెంట్ ఉంది కాబట్టే రమ్యకృష్ణ కరెక్ట్ ఛాయిస్ అని నాగార్జున ఫిక్యయ్యారు.

,  ,  ,  ,  ,  ,