Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Sep-2016 11:44:25
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు రమ్యకృష్ణ వయసు ఎంతుంటుంది? ఇలా అడగ్గానే అలా ఇంటర్నెట్ లో సెర్చ్ చేసేసి.. వికిపీడీయా తిరగసేసి.. 46 అని చెప్పేయడం చాలా ఈజీ. కానీ సినీ నటుల విషయంలో.. ముఖ్యంగా హీరోయిన్స్ గా వెలిగిపోయిన వారి విషయంలో ఇలా ప్రచారంలో ఉన్న వయసులను నమ్మనే నమ్మకూడదు. ఆ విషయంలో రమ్యకృష్ణ కారణంగా మరోసారి తేలిపోయింది.

అమరేంద్ర బాహుబలి పెద్దమ్మ శివగామికి ఇప్పుడు రియల్ ఏజ్ ఎంతో తెలుసా? ఈ సెప్టెంబర్ 15తో రమ్యకృష్ణ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసేసింది. 50 బర్త్ డే జరుపుకుంది. కుటుంబ సభ్యుల మధ్యన.. భర్త కృష్ణవంశీ- కుమారుడు రిత్విక్ తో కలిసి పుట్టిన రోజు కేక్ కట్ చేసింది రమ్యకృష్ణ. ఈ సమయంలోనే రమ్య అసలు ఏజ్ గురించి చాలా మందికి తెలిసి ఆశ్యర్యపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా రమ్యకృష్ణ ఫ్యాన్స్ అయితే.. ఒక్కసారిగా షాక్ తినేశారు. ఇప్పటికీ ఇంత గ్లామర్ మెయింటెయిన్ చేసే రమ్యకృష్ణకు.. యాభయ్యేళ్లా అనుకుంటున్నారు.

అంతే మరి.. 1985లో సినిమా కెరీర్ మొదలుపెట్టిన రమ్యకృష్ణ.. 32 ఏళ్లుగా నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూనే ఉంది. మొదటి సినిమాలోనే ముమ్మట్టి-మోహన్ లాల్ లతో కలిసి ఓ మలయాళ మూవీ చేయగా.. నరసింహలో చేసిన నీలాంబరి.. బాహుబలిలో చేసిన శివగామి పాత్రలు.. రమ్యకృష్ణ నట జీవితాన్ని మరో మెట్టు ఎక్కించాయి

,  ,  ,  ,  ,  ,