Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Oct-2015 12:48:40
facebook Twitter Googleplus
Photo

మెగా డాటర్ నీహారిక లాంఛింగ్ మూవీ ఒక్క మనసు. ఈ నెల 30న జరగబోయే మూవీ స్టార్టింగ్ ఫంక్షన్ ని మెగా ఫ్యామిలీ అండదండలతో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. నాగశౌర్య హీరోగా నటించనున్న ఈ లవ్ ఎంటర్టెయినర్ ని.. మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు తీసిన రామరాజు దర్శకత్వం వహించనున్నాడు.

నీహారిక నటిస్తున్న ఒక్క మనసులో ఇందులో మదర్ కేరక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఈ రోల్ ని ప్రఖ్యాతి చెందిన నటీమణులతో నటింపచేయాలని ఆలోచిస్తున్నారట మేకర్స్. అందుకోసం దక్షిణాది సీనియర్ హీరోయిన్ బాహుబలిలో శివగామి పాత్రతో నేషనల్ పాపులర్ అయిన రమ్యకృష్ణను తీసుకునే యోచనలో ఉన్నారట. అయితే.. బడ్జెట్ పరిధి సహకరిస్తేనే.. అని అండర్ లైన్ చేసుకోవాలి.

మెగాస్టార్ సరసన పలు సినిమాల్లో నటించింది రమ్యకృష్ణ. అప్పట్లో నాగబాబు పక్కన కౌరవుడు చిత్రంలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. మెగా బ్రదర్స్ ఇద్దరి పక్కన హీరోయిన్ గా చేసిన రమ్యకృష్ణని.. ఇప్పుడు మెగాడాటర్ కి మదర్ గా నటించనుండడం విశేషమే. సినిమా పాత్రలకు వరుసలు ఉండవు కానీ.. వరస మారకుండా.. రిలేషన్ భలేగా కంటిన్యూ చేస్తున్నారు కదూ ఒక్కమనసు మూవీ మేకర్స్.

,  ,  ,  ,  ,