Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jan-2017 11:07:35
facebook Twitter Googleplus
Photo

కొన్ని సినిమాలు ఓకే చేసినప్పుడు ఎలాంటి అంచనాలు ఉండవు.కానీ.. సినిమా షూట్ మొదలెట్టి.. కొంత పని మొదలయ్యాక ఆ సినిమాపై అంచనాలు పెరుగుతుంటాయి. ఇక.. సినిమా విడుదలకు దగ్గరపడుతున్న కొద్దీ ఆ సినిమాపై హైప్ ఓ రేంజ్లో పెరగటం కొన్ని సినిమాలకు కనిపిస్తుంటుంది. అలాంటి పరిస్థితే.. రానా.. తాప్సీ తాజాగా నటించిన ఘాజీ సినిమాకు ఉంది.

సినిమా మొదలెట్టినప్పుడు ఎవరి దృష్టిని పెద్దగా ఆకర్షించని ఈ సినిమా.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమేకాదు.. సినిమా విడుదలపై ఆసక్తిని పెంచింది. ఇదంతా కూడా.. సినిమా టీజర్ విడుదలయ్యాకే స్టార్ట్ అయ్యిందని చెప్పాలి. ఫిబ్రవరి 17న థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని చిత్ర కథానాయకుడు రానా దగ్గుబాటి చెప్పుకొచ్చారు.

ఈ సినిమాకు చేస్తున్నట్లు కొందరికి చెప్పినప్పుడు తనను పిచ్చోడి మాదిరి చూశారన్నారు. ఏ సినిమా చేస్తున్నావని అడిగారని.. సబ్ మెరైన్ కథతో సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు.. అదోలా చూశారని కానీ ఇప్పుడు అదే సినిమాను కరణ్ జోహార్.. టాన్ డన్ లు సినిమాను హిందీలో రిలీజ్ చేయటానికి ముందుకొచ్చినట్లు చెప్పుకొచ్చాడు.

అంతేనా.. సినిమా టీజర్ చూశాక.. అమితాబ్ వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ఓకే చేశారన్నారు. వైజాగ్ తనకు 20 ఏళ్లుగా అనుబంధం ఉన్నప్పటికీ ఘాజీ కథ తెలీదన్నాడు. ఈ సినిమా గురించి విపరీతమైన ఎగ్జైట్ మెంట్ ను ప్రదర్శిస్తున్న రానా మాటలు.. సినిమా మీద మరింత ఆసక్తిని పెంచుతున్నాయనే చెప్పాలి.

,  ,  ,  ,  ,