Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2017 12:03:33
facebook Twitter Googleplus
Photo

ఒక్కో సమయంలో సినిమాలకు ఒక్కో సీజన్ నడుస్తూ ఉంటుంది. కొన్ని కాన్సెప్టులను మాత్రం హ్యాండిల్ చేసేందుకు అంతగా ఉత్సాహం చూపరు. ముఖ్యంగా టాలీవుడ్ లో పీరియాడిక్ దేశభక్తి చిత్రాలను చేసేందుకు ఉత్సాహం చూపరు. చిన్న హీరోలే ఈ కాన్సెప్టులకు వెనుకాడితే.. స్టార్స్ పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. అలాగని ఈ జోనర్ లో అసలు సినిమాలు రాలేదని కాదు.

ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఓ దేశభక్తి చిత్రాన్ని దాదాపు 130 కోట్లకు పైగా బడ్జెట్ తో తీసేందుకు ప్రయత్నించడం.. దేశంలో ఇదే ప్రథమం. మరోవైపు 1945 అంటూ ఓ మల్టీ లింగ్యువల్ చేస్తున్నాడు దగ్గుబాటి రానా. ఈ రెండిటి కంటే ముందు బ్రిటిషర్ల పై పోరాటం చేసిన టాలీవుడ్ సినిమాల వివరాలు చూద్దాం.సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు.. ఎన్నో సెన్సేషన్స్ సృష్టించింది. అలాగే ఎన్టీఆర్ నటించిన సర్దార్ పాపారాయుడు కూడా భారీ హిట్ కొట్టింది.

ఆ సినిమాల్లోని డైలాగ్స్.. ఇప్పటికీ అప్పటి ప్రేక్షకుల చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి. సుభాష్ చంద్రబోస్ అంటూ ఇలాగే ఓ ఫైట్ చేశాడు వెంకటేష్. రాజన్న పేరుతో నాగార్జున కూడా గట్టి ప్రయత్నాన్నే చేశారు. కానీ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి

,  ,  ,  ,  ,  ,