Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jan-2017 13:55:38
facebook Twitter Googleplus
Photo

దగ్గుబాటి వారసుడు రానా లీడర్ మూవీతో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తనకు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సిన కేరక్టర్ ను చేసి మెప్పించాడు. స్టోరీ.. థీమ్ పరంగా కూడా ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ ఇలాంటి పొలిటికల్ సబ్జెక్టులు మన దగ్గర చాలా తక్కువగా వస్తుంటాయి.

ఇప్పుడు మళ్లీ రాజకీయాలనే థీమ్ గా తీసుకుని ఓ మూవీ తెరకెక్కనుండగా.. అందులో కూడా రానా హీరోగా నటిస్తుండడం విశేషం. తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'నేనే రాజు నేనే మంత్రి' అనే టైటిల్ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అనంతపూర్ లో ప్రారంభమైంది. మరికొన్ని రోజుల పాటు ఇక్కడే పిక్చరైజ్ చేయనుండగా.. ఓ పొలిటికల్ 'లీడర్'గా రానా రోడ్లపై నడిచే సన్నివేశాన్ని తాజాగా తెరకెక్కించారు.

గతంలో తమిళనాడులోని కరైకుడి ప్రాంతంలో ఈ ప్రధానమైన షెడ్యూల్ ని ఈ మూవీ పూర్తి చేసుకుంది. అక్కడ లవ్.. అండ్ ఫ్యామిలీకి సంబంధించిన ఎపిసోడ్స్ చిత్రీకరించగా.. ఇప్పుడు పొలిటికల్ సీన్స్ ను అనంతలో తెరకెక్కిస్తున్నారు. కాజల్.. కేథరిన్ థ్రెసాలు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంతో... దర్శకుడు తేజ తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతానని ఆశలు పెట్టుకున్నాడు.

,  ,  ,  ,  ,