Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Jun-2016 12:23:15
facebook Twitter Googleplus
Photo

బాహుబలి కోసం రాజమౌళి అండ్ టీం రకరకాలుగా ప్రమోషన్స్ చేశారు. ఇప్పుడు చైనాలో రిలీజ్ ఉండడంతో.. అక్కడి మీడియాను పిలిపించుకుని మరీ ఇక్కడ ప్రమోషన్స్ చేశారు. చాలామంది మీడియా ప్రతినిధులు చైనా నుంచి ఇక్కడికి వచ్చి.. స్పెషల్ ఇంటర్వ్యూలు - గ్రూప్ ఇంటర్వ్యూలు - లైవ్ స్ట్రీమింగ్ లు.. ఇలా రకరకాలుగా ప్రమోషన్ యాక్టివిటీస్ చేపట్టారు. విలన్ పాత్రధారి రానా ఈ ప్రమోషన్స్ లో అనుభవాలను పంచుకుంటూ.. పనిలో పనిగా మన మీడియా జనాలపై చురకలు అంటించాడు.

'చైనా నుంచి చాలామంది ప్రింట్ - టీవీ జర్నలిస్టులు వచ్చారు. వాళ్లంతా చాలా డిసిప్లిన్డ్ గా ప్రశ్నలు అడిగారు. ఏ ఒక్క ప్రశ్న కూడా రిపీట్ కాకుండా అంతమంది అడగడం ఆశ్చర్యం వేసింది' అన్న రానా.. ఇక్కడి జర్నలిస్టుల తీరుపై కూడా కామెంట్స్ చేశాడు. 'సాధారణంగా మేం ఇంటర్వ్యూలు ఇస్తున్నపుడు జర్నలిస్టులు అడిగిందే అడుగుతూ ఉంటారు. ఇది బాగా విసుగు తెప్పిస్తుంది. చైనా మీడియాకి ఇంటర్వ్యూలను మేం ఒకే ఒక్క రోజులో కంప్లీట్ చేయగలిగాం. లైవ్ స్ట్రీమింగ్ కూడా ఆ రోజే పూర్తయిపోయింది' అని చెప్పాడు రానా.

బాహుబలి ది కంక్లూజన్ అద్భుతంగా ఉంటుందని.. హాలీవుడ్ స్టాండర్డ్స్ కి తగిన స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పిన రానా.. మరికొన్ని రోజుల్లో బాహుబలి షూటింగ్ లో భాగం కానున్నట్లు చెప్పాడు. బాహుబలి సెకండ్ పార్ట్ లో ఓల్డేజ్ గెటప్ లోను - యంగ్ గెటప్ లోను తాను కనిపిస్తానన్నాడు రానా.

,  ,  ,  ,  ,  ,