Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-May-2017 13:15:42
facebook Twitter Googleplus
Photo

గత నాలుగు వారాలుగా దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి బాహుబలి2 ఒక్క మాటే వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ తాకిడి మరీ ఎక్కువగా ఉంది. బాహుబలి విడదులకు వారం ముందు నుంచి చెప్పుకోదగ్గ సినిమా ఏదీ రిలీజ్ చేయలేదు టాలీవుడ్ మేకర్స్.

బాహుబలి తర్వాత ఇక్కడ బాబు బాగా బిజీ గత వారం విడుదల కాగా.. ఈ వారంలో శర్వానంద్ నటించిన రాధా రిలీజ్ అయింది. రెండు సినిమాలపైనా రిపోర్టులు రివ్యూలు అంతగా లేవు. కానీ రాబోయే రెండు వారాల్లో విడుదల కానున్న రెండు సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. మే 19న విడుదల కానున్న నిఖిల్ నటించిన కేశవ విడుదలవుతోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో క్రైం థ్రిల్లర్ గా ఈ చిత్రం రూపొందింది. మరోవైపు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన రా రండోయ్ వేడుక చూద్దాం మే 26న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు ఆన్ లైన్ లో మంచి హంగామా చేస్తున్నాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాల థియేట్రికల్ ట్రైలర్స్ ను ఇవాళే రిలీజ్ చేయబోతున్నారు. ఇద్దరు డైరెక్టర్ల ట్యాలెంట్స్ పైనా టాలీవుడ్ బోలెడంత నమ్మకంగా ఉంది

,  ,  ,  ,  ,