Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Feb-2017 10:27:42
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ పై ట్విట్టర్ ఎఫెక్ట్ బాగానే పడుతోంది. మన సెలబ్రెటీలు ఒక్కొక్కరుగా ట్విట్టర్లోకి వచ్చేస్తున్నారు. ఆల్రెడీ ట్విట్టర్లో ఉన్నవాళ్లు యాక్టివ్ అయిపోతున్నారు. రెండు రోజుల కిందటే మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ అరంగేట్రం చేయగా.. తాజాగా మాస్ రాజా రవితేజ కూడా ట్విట్టర్లోకి అడుగు పెట్టేశాడు. బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ట్విట్టర్లోకి అరంగేట్రం చేశాడు మాస్ రాజా.

వెంటనే ట్విట్టర్ సెలబ్రెటీల నుంచి మాస్ రాజాకు ఘన స్వాగతం లభించింది. మూడు గంటల్లోనే ఏడు వేల మందికి పైగా అతడి ఫాలోవర్లుగా మారిపోయారు. మాస్ రాజా కూడా ఇద్దరికి ఫాలోవర్ గా మారాడు. ఐతే అతను లోకల్ వాళ్లను అనుసరించట్లేదు. తన ఆరాద్య హీరో అమితాబ్ బచ్చన్ తో పాటు.. మరో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను కూడా ఫాలో అవుతున్నాడు.

తన ట్విట్టర్ అరంగేట్రంపై జనాల స్పందన చూసిన రవితేజ.. ఎగ్జైట్ అయిపోయాడు. అందరూ చెబుతున్నారు కదా అని ఊరికే ట్విట్టర్లోకి వచ్చా. ఐతే ఇక్కడ ఇంత కిక్ వస్తుందని ఇప్పుడే తెలిసింది. టచ్ చేశారు. టచ్ లో ఉంటాను అని ట్వీట్ చేశాడు మాస్ రాజా. తన ట్విట్టర్ అరంగేట్రం గురించి అభిమానులు పెట్టిన సరదా ట్వీట్లన్నింటినీ మాస్ రాజా రీ ట్వీట్ చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలిపాడు.రకుల్ ప్రీత్.. హరీష్ శంకర్.. ఛార్మి.. గోపీచంద్ మలినేని.. సునీల్.. మెహ్రీన్.. తమన్.. ఇంకా చాలామంది సెలబ్రెటీలు మాస్ రాజాకు వెల్కమ్ చెప్పారు.

,  ,  ,  ,  ,