Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-May-2017 10:32:36
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో పెద్దగా ప్రయోగాలు చేయని మాట వాస్తవమే. కాకపోతే గతంలో కె.విశ్వనాథ్ వంటి దర్శకులు కమర్షియల్ ఫార్మాట్ లేకుండా కూడా బ్లాక్ బస్టర్లు తీశారు. ఆ తరువాత క్రిష్ వంటి దర్శకుడు కమర్షియాలిటీ ఉంటూనే కొత్త కొత్త కథలను ఆవిష్కరిస్తున్నారు. కాకపోతే కొందరు డైరక్టర్లు మాత్రం ఇంకా అదే మాస్ మసాలా ఫార్ములాలో సినిమాలు దంచేస్తూ.. ఆడియన్స్ కు అగ్ని పరీక్ష పెడుతున్నారు.

ఇప్పుడు రవితేజ అండ్ గోపిచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందట. ఈ కాంబో వినగానే మనకు గుర్తొచ్చేది.. డాన్ శీను అండ్ బలుపు సినిమాలే. అవి రెండూ కూడా రొటీన్ చింతకాయ పచ్చడిలే. కోట్లు ఖర్చుపెట్టి మళ్ళీ మళ్ళీ అవే కథలూ సీన్లూ పాత చింతకాయ వంటి కామెడీలు ఎందుకు తీస్తారో కూడా అర్దమవ్వని పరిస్థితి. అందుకే ఈ సినిమాల తరువాత గోపి తీసిన పండగ చేస్కో మరో రొటీన్ రభస అయితే.. విన్నర్ అసలు ఏ మాత్రం దమ్ము లేని డమ్మీ మూవీ అయిపోయింది. మూసలో నుండి బయటకు వస్తే కాని గోపిచంద్ మలినేని హిట్టు కొట్టలేని పరిస్థితి.

అలాగే రవితేజ కూడా ఎన్నేళ్ళూ గ్యాప్ తీసుకున్నా కూడా మూస సినిమాలే చేస్తే కష్టం. అందుకే.. బాబూ గోపి.. నాయనా రవి.. ఈసారి మీ కాంబినేషన్లో రొటీన్ సినిమా చేయకండి ప్లీజ్ అంటున్నారు సినిమా లవ్వర్స్.

,  ,  ,  ,  ,