Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Apr-2016 10:57:29
facebook Twitter Googleplus
Photo

బాలయ్య వందో సినిమా గురించి మూణ్నాలుగేళ్లుగా చర్చ జరుగుతోంది. ఆ చర్చల్లో దర్శకుడిగా ఎక్కువ వినిపించిన పేరు బోయపాటి శ్రీనుదే. బాలయ్యకు సింహా.. లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్లు కొట్టిన బోయపాటితోనే వందో సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు ఆశించారు. బాలయ్య కూడా ఓ దశలో బోయపాటితోనే వందో సినిమా చేసేలా కనిపించాడు. దీని గురించి మీడియాలో కూడా మాట్లాడాడు. కానీ ఏమైందో ఏమో.. సడెన్ గా బోయపాటి సైడైపోయాడు. వేరే దర్శకుల పేర్లు తెరమీదికి వచ్చాయి. చివరికి బాలయ్య క్రిష్ తో సినిమా కమిటయ్యాడు. ఐతే బోయపాటి ఎందుకు బాలయ్య వందో సినిమా చేయలేకపోయాడన్న సందేహం మాత్రం అభిమానుల్లో ఉండిపోయింది.

ఈ సందేహాలకు స్వయంగా బోయపాటే సమాధానం ఇచ్చాడు. బాలయ్యతో మళ్లీ సినిమా.. అది కూడా ఆయనకు వందోది అంటే.. ఆ రెంటికి మించి ఓ రేంజిలో ఉండాలని.. ఆ స్క్రిప్టు తయారు చేయడానికి తనకు కనీసం 4 నెలల సమయం కావాలని.. ఐతే బాలయ్యకు ఓ లైన్ చెప్పగా ఆయన ఓకే అని కూడా చెప్పారని.. కాకపోతే స్క్రిప్టు రాయడానికి నాలుగు నెలలు టైం కోరడంతోనే ఇబ్బంది వచ్చిందని.. దీంతో ఆ సినిమా చేయలేకపోయానని బోయపాటి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా కమిటై ఉండటం కూడా బాలయ్యతో సినిమా చేయకపోవడానికి ఓ కారణమని అన్నాడు. ఐతే బాలయ్య బాబు అభిమానులు.. మీడియా వాళ్లు వందో సినిమా తానే చేయాలని కోరుకోవడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని బోయపాటి చెప్పాడు. వందో సినిమా చేయలేకపోయానని.. బాలయ్య కూడా మళ్లీ సినిమా చేద్దామని అన్నారని బోయపాటి తెలిపాడు.

,  ,  ,  ,  ,  ,  ,  ,