Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jun-2016 13:57:50
facebook Twitter Googleplus
Photo

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ కబాలికి తమిళ్ - తెలుగు భాషల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇంత హైప్ వచ్చిన సినిమాకి అద్భుతమైన రేంజ్ లో ప్రమోషన్స్ జరగాల్సి ఉండగా.. కనీసం ఆడియో ఫంక్షన్ కూడా చేయడం లేదు. పైగా ఇప్పుడు రజినీకి అనారోగ్యంగా ఉందనే టాక్ వినిపిస్తోంది.

రజినీ హెల్త్ బాగోకపోవడంతో.. అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారని అంటున్నారు. ఫ్యామిలీతో కలిసి సూపర్ స్టార్ అమెరికా వెళ్లారని అందరికీ తెలుసుకానీ.. ఇది వెకేషన్ టూర్ కాదనే టాక్ వినిపిస్తుంది. రజినీకి ఆరోగ్యం బాగోకపోవడంతోనే కబాలి ఆడియో ఫంక్షన్ నిర్వహించడం లేదని కొందరి వాదన. అయితే.. ఇవన్నీ రూమర్లని కొందరు చెబుతున్నారు. ఆయన హెల్త్ కి వచ్చిన ప్రాబ్లెం ఏం లేదని.. కులాసాగా ఉన్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం కబాలి ఆడియో రిలీజ్ ఎందుకు చేయలేదు అని అభిమానులు అడుగుతున్నారు. అది కవర్ చేయడానికి కబాలి మేకర్స్ ఇలా రజనీకాంత్ గురించి రూమర్లు సృష్టించారనే డౌట్స్ వినిపిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకమైన కారణం కూడా ఉందిట. ఒకవేళ కబాలి ఆడియో ఈవెంట్ చేస్తే.. లింగా - కొచ్చాడయాన్ పంపిణీదారులు వచ్చి గొడవ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే కబాలి ఫంక్షన్ ను ఎగ్గొట్టేసి.. అనారోగ్యం టాక్ ని స్ప్రెడ్ చేశారనే వాదన వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,  ,  ,  ,