Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Sep-2016 12:44:21
facebook Twitter Googleplus
Photo

చెన్నై బ్యూటీ త్రిష కెరీర్ స్లంప్ లో పడిపోయిందని అనుకుంటున్న టైమ్ లో.. ఆమెకు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ఆఫర్ రావడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. నాయకి పేరుతో రూపొందిన ఈ సినిమాలో.. త్రిష దెయ్యంగా కూడా నటించేసి మెప్పించేందుకు ట్రై చేసింది. సినిమా సంగతి ఎలా ఉన్నా.. అసలు ఈ సినిమా ప్రమోషన్స్ కి హీరోయిన్ డుమ్మా కొట్టేయడం.. బాగానే ఎఫెక్ట్ చూపించిందనే కామెంట్స్ ఉన్నాయి.

ఈ నాయకి తమిళ వెర్షన్ రిలీజ్ ఇవాళే. ఇలాంటి టైమ్ లో నాయకి గురించి త్రిష కొన్ని కీలకమైన కామెంట్స్ చేసింది. 'నా సినిమాపై నేను మాట్లాడకపోవడం.. ప్రమోషన్స్ కి హాజరుకాకపోవడం అంటే.. అందుకు రీజన్స్ ఉన్నాయనే కదా అర్ధం. దీని గురించి అడుగుతున్న మీడియా ఫ్రెండ్స్.. ఫ్యాన్స్ కి నా సారీ' అని చెప్పిన త్రిష.. త్వరలో మరింత డీటైల్డ్ గా చెప్పేందుకు ట్రై చేస్తానంటోంది.

'త్వరలో పర్సనల్ గా ఇందుకు కారణాలు చెబుతాను. నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్' అంటూ త్రిష చెప్పడంతో.. నాయకి వెనకాల ఏదో జరిగిందనే వార్తలకు బలం చేకూరింది. నాయకి ఫెయిల్యూర్ విషయంలో త్రిష ప్రచారం చేయకపోవడమే పెద్ద కారణం అనే కామెంట్స్ కి సమాధానంగానే చెన్నై బ్యూటీ ఇలా చెప్పిందంటున్నారు సినీ జనాలు

,  ,  ,  ,  ,  ,  ,  ,  ,