Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-May-2015 10:41:37
facebook Twitter Googleplus
Photo

ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ సరసన 'సుబ్రమణ్యం ఫర్ సెల్' చిత్రంలో నటిస్తున్న సెక్సీతార రెజీనా త్వరలో మంచు విష్ణు పక్కన నటించే అవకాశం కనిపిస్తోంది. ఇన్నాళ్లు తమ్ముడి వివాహం సందర్భంగా ఆ పనుల్లో బిజీగా వున్న విష్ణు, ఇక ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టాడు. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న 'డైనమైట్' చిత్రం షూటింగును పూర్తి చేయడానికి రెడీ అయ్యాడు. కాగా, దీని తర్వాత హనుమాన్ ముప్పరాజు అనే నూతన దర్శకుడితో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో కథానాయికగా రెజీనాను ఎంచుకున్నట్టు, ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

,  ,  ,  ,