Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Mar-2017 14:01:59
facebook Twitter Googleplus
Photo

తన మొదటి భార్యకు విడాకులిచ్చి మరీ రేణు దేశాయ్ ను పెళ్లి చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బద్రి టైంలో ఆమెతో బాగా క్లోజ్ అయిపోయి.. ఆ బంధాన్ని ఆ తర్వాత కూడా కొనసాగించి.. పెళ్లికి ముందే తనతో కొడుకును కూడా కని.. పెళ్లి తర్వాత కూడా ఆమెతో చాలా అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించాడు పవన్. అలాంటిది వీళ్లిద్దరూ విడిపోవడం పెద్ద షాకే. ఇద్దరికీ విభేదాలు వచ్చి ఒకరికొకరు దూరంగా ఉన్నారన్న విషయం ముందు జనాలు అసలు నమ్మనే లేదు. కానీ విడాకులు తీసుకున్నాక కానీ ఈ వాస్తవాన్ని అంగీకరించలేకపోయారు జనాలు. అభిరుచులు కలిసి పెళ్లి చేసుకున్న వీళ్లిద్దరూ అసలెందుకు విడిపోయారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్న.

ఈ విషయంలో పవన్ అసలెప్పుడూ మాట్లాడడు. రేణు మీడియాతో మాట్లాడినా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పదు. ఐతే త్వరలోనే ఈ సందేహం తీరబోతోంది. రేణు దేశాయ్ పవన్ తో విడాకులకు కారణమేంటో చెబుతానంటోంది. ఐతే అది మామూలుగా కాదు. ఒక పుస్తకం ద్వారా ఈ ప్రశ్నకు జవాబు చెప్పనుందట రేణు. త్వరలోనే తాను ఆత్మకథ రాయబోతున్నానని.. అందులో పవన్ తో విడాకులకు కారణమేంటో స్పష్టంగా తెలియజేస్తానని రేణు తెలిపింది. తమ విడాకులకు బలమైన కారణాలే ఉన్నాయని ఆమె తెలిపింది. పెళ్లి.. విడాకులు.. రెండు విషయాల్లోనూ తాను తొందరపడ్డానని రేణు చెప్పడం గమనార్హం. ఐతే విడాకులైనప్పటికీ పవన్ మీద తన అభిమానం ఏమీ తగ్గలేదని.. తనను ఒక గురువు లాగా భావిస్తానని.. ఆయన్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని రేణు చెప్పడం విశేషం. పవన్-రేణు విడాకులకు కారణాలంటూ చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి

,  ,  ,  ,