Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Aug-2016 13:11:53
facebook Twitter Googleplus
Photo

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ముద్దుల కొడుకు గురించి చిన్న నోట్ రాసి అభిమానులకు చూపించింది..ఏంటా ఆ నోట్ అనుకుంటున్నారా..! అయితే ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్ళల్సిందే..

పవన్ ? రేణు ల ముద్దుల కుమారుడు అకీరా నందన్ సినిమా ఎంట్రీ కోసం అభిమానులు క‌ళ్ళు కాయ‌లు కాసేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసందే. రెండేళ్ళ క్రితం రేణు దర్శకత్వం వహించిన ?ఇష్క్ వాలా లవ్‌? సినిమాలో ఓ చిన్న రోల్ లో అకిరా ను చూపించి అక్కడి ప్రేక్షకులకు ఆనందాన్ని నింపింది. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం అదృష్టం ఇంకా రాలేదు. ఆ మధ్య ఈ చిత్రం తెలుగు లో డబ్ అవుతుందని ప్రచారం జరిగిన , అది కేవలం ప్రచారానికే పరిమితం అయ్యింది.

దీంతో రేణు ఈ చిత్రాన్ని డైరెక్ట్ గా బుల్లితెర ఫై విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యింది. దీనికి సంబదించిన పనులుకూడా జరుగుతున్నాయి. అయితే మరాఠీలో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకున్న అకీరా తెలుగులోను చెప్పుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా రేణు తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.

అకిరా మొదటిసారి బుల్లితెర ఫై కనిపించడం తో అభిమానులు అంచనాలు ఎక్కువగా పెట్టుకుంటారనే నేపథ్యం లో అభిమానులకు అకిరా గురించి ఓ చిన్న నోట్ రాసింది. ఇష్క్ వాలా లవ్ చిత్రంలో నటించినప్పుడు అకీరాకి 9 ఏళ్ళు. ఈ చిన్న డెబ్యూ రోల్‌కి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయోద్దని నా విన్నపం అంటూ తన నోట్‌లో తెలిపింది. త్వరలోనే అభిమానుల కోరిక తీరబోతున్న నేపథ్యం లో అకిరా ను ఎలా ఆదరిస్తారో చూడాలి మరి.

,  ,  ,  ,  ,  ,