Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Nov-2016 10:58:24
facebook Twitter Googleplus
Photo

ఇటీవలి కాలంలో సినిమాలు నిర్మించడంలో తక్కువగా కనిపిస్తూ ట్విటర్లో పంచ్ లతో ఎక్కువగా కనిపిస్తున్న విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు పిల్లల దినోత్సవం సందర్భంగా తనదైన శైలిలో ఆడుకున్నారు. అది కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంచ్ లు పేల్చారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా ట్వీట్ చేస్తూ హ్యాపీ చిల్డ్రన్స్ డే కేజ్రీవాల్ అని వర్మ ట్వీటాడు. ఇలా కేజ్రీవాల్ ను చిన్నారితో పోల్చడంతోనే ఆగిపోకుండా ఇంకో ఫోటో జత చేసి తన పంచ్ పవర్ ను చాటుకున్నాడు వర్మ.

ఒక సందర్భంలో నిరసన తెలుపుతూ పేపర్ ను తగులబెడ్తున్న కేజ్రీవాల్ ఫైల్ ఫొటోను పోస్ట్ చేస్తూ మఫ్లర్ మ్యాన్ గా కనిపించే కేజ్రీ వెనకాల ఇంత కిల్లర్ దాగున్నాడా అంటూ సెటైర్ వేశాడు. కేజ్రీవాల్ సీరియస్ నెస్ చూస్తుంటే దీపికా పదుకొనే కంటే హాట్ గా కేజ్రివాల్ ఉన్నట్లున్నాడే అంటూ పంచ్ వేశాడు. వర్మకు ఆయన అభిమానులు సైతం తోడయి మరింత జోరుగా ట్వీట్ చేశారు. చిన్నారుల వలే ఫిర్యాదులు చేయడంలో కేజ్రీ అందరికంటే ముందుంటారని ఓ వ్యక్తి తన భావాన్ని పంచుకున్నారు. ఈ ట్వీట్ బానే ఉంది కానీ...ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మరిచిపోయారేంటని ఓ నెటిజన్ వర్మను మరింతగా కెలికాడు.

,  ,  ,  ,  ,