Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Apr-2016 13:42:08
facebook Twitter Googleplus
Photo

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూర్తిస్థాయి మాస్ హీరోగా మాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందించిన చిత్రం సరైనోడు. ఏప్రిల్ 22 విడుదల అవుతున్న ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు యస్. యస్. థమన్ తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
ప్రశ్న) ?సరైనోడు? ఆడియో కి మంచి స్పందన లభించింది కదా? ఎలా ఉంది?
స) రేసు గుర్రం తరువాత నేను అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా కాబట్టి సహజంగానే నాపైన ఒత్తిడి ఉంటుంది. అయితే మాస్ ప్రేక్షకులకు సరైనోడు పాటలు బాగా నచ్చాయి. ఈ పాటలు సినిమా మరింత విజయం సాధించాడానికి ఉపయోగపడతాయని అనుకుంటున్నాను.
ప్రశ్న) అల్లు అర్జున్ ఎటువంటి సలహాలు ఇచ్చాడు?
స) అల్లు అర్జున్ కి మ్యూజిక్ పైన, మారుతున్న ప్రేక్షకుల అభిరుచిపైన మంచి అవగాహన ఉంది. తను కోరుకున్నది ఒక్కటే మాస్ కి, క్లాస్ కి నచ్చేవిధంగా మంచి పాటలు కావాలని
ప్రశ్న) తెలుసా తెలుసా బాగా ఆకట్టుకుంది. ఆ పాట గురించి చెప్పండి?
స) నాకు రొమాంటిక్ పాటలకు సంగీతం అందించడం అంటే ఇష్టం. అలాంటి సన్నివేశం ఎప్పుడు కుదిరినా నేను తప్పనిసరిగా మంచి ట్యూన్ ఇస్తాను. ?తెలుసా తెలుసా? పాట ఒక్క సిటింగ్ లోనే ఒకే అయ్యింది. ఈ పాట అంత పెద్ద హిట్ కావడానికి కారణం ఈ పాట పాడిన జూబిన్, సమీరా భరధ్వాజ్. వీళ్ళిద్దరూ ఆ పాటని అద్భుతంగా పాడారు .
ప్రశ్న) దర్శకుడు బోయపాటి శీను తో పని చేయడం ఎలా ఉంది?
స) నేను మొదట్లో బోయపాటి శీనుతో పనిచేయడానికి చాలా భయపడ్డాను. అయితే మేం చాలా సార్లు చెన్నై లో కలుసుకుని మ్యూజిక్ గురించి చర్చించుకోవడంతో ఒక అవగాహనకి వచ్చాం. ఆ అవగాహనతోనే అద్భుతమైన పాటలు ఇచ్చాను.
ప్రశ్న) మీరు గాయకులను ఎలా ఎంపిక చేసుకుంటారు?
స) అది ప్రతీసారి మారుతుంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే.. నాకు విశాల్ డాడ్లాని తో పనిచేయాలని ఉండేది. ఈ సినిమాలో అతను పాడిన ?అతిలోక సుందరి? పాట వింటే అతనంటే ఏంటో తెలుస్తుంది. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే అతను కేవలం అరగంట వ్యవధిలో ఈ పాట పాడాడు.
ప్రశ్న) తెలుగు చిత్రపరిశ్రమలో కాంపిటీషన్ ని ఎలా డీల్ చేస్తారు ?
స) ఏ సంగీత దర్శకుడి పాటలు హిట్ అయినా నాకు చాలా భయం వేస్తుంది. ఇక ఐటమ్ సాంగ్స్ హిట్ అయితే ఇంకా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే? ఒక సంగీత దర్శకుడు ఓ మంచి పాట ఇచ్చాడంటే.. నేను తప్పనిసరిగా అతనికంటే మంచి పాట ఇవ్వాల్సిఉంటుంది కాబట్టి నాపై ఒత్తిడి ఉంటుంది. అయితే నాకు ఈ కాంపిటీషన్ అంటే ఇష్టమే ఎందుకంటే దీనివల్ల మరింత మంచి అవుట్ పుట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రశ్న) మిమ్మిల్ని విమర్శించేవారికి మీరిచ్చే సమాధానం ఏమిటి?
స) చూడండి. నిజం చెప్పాలంటే ట్యూన్ కానీ పాటలు కానీ నేనొక్కడినే నిర్ణయించను. ఎంతో మంది దీనిలో భాగస్వామ్యం ఉంటుంది. ఒక పాట సరిగా లేదంటే అందుకు భాగస్వామ్యం వహించిన వారు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అని అనిపిస్తుంది నాకు.
ప్రశ్న) మళ్ళీ ఎప్పుడు తెరపై కనిపిస్తారు?
స) ?బాయ్స్? సినిమాకు సీక్వెల్ చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయి. మరో రెండు నెలల్లో ఈ ప్రాజెక్ట్ మొదలవుతుంది. నేను ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతం కూడా సమకూర్చుతున్నాను.
ప్రశ్న) బాలీవుడ్ ప్లాన్స్ ఉన్నాయా..?
స) ఆలోచన ఉంది. బాలీవుడ్ లో ఓ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను.
ప్రశ్న) రీమిక్స్ కి దూరంగా ఉంటున్నారు. ఎందుకు?
స) ఒరిజనల్ పాటను చెడగొట్టడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే పాతపాటలో ఉన్న మ్యాజిక్ ని మళ్ళీ సృష్టించడం సాధ్యం కాదు? అందుకే నేను రీమిక్స్ కి దూరంగా ఉంటున్నాను.
ప్రశ్న) మీరు చేస్తున్న సినిమాల గురించి చెప్పండి?
స) ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ తో చేస్తున్న ?సుప్రీమ్? సినిమాకి పనిచేస్తున్నాను.

,  ,  ,  ,