Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-Oct-2016 11:47:10
facebook Twitter Googleplus
Photo

అక్కినేని నాగచైతన్య లాంగ్ డిలేయ్డ్ మూవీ ?సాహసం శ్వాసగా సాగిపో? విషయంలో చాన్నాళ్లుగా కొనసాగుతున్న సస్పెన్సుకు తెరపడబోతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ రాబోతోంది. గురువారమే ?సాహసం శ్వాసగా సాగిపో? కొత్త ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగానే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశముంది. ఈ సినిమా ట్రైలర్ కొన్ని నెలల కిందటే రిలీజైంది.

ఐతే ఆ తర్వాత సినిమా వార్తల్లో లేకుండా పోయింది. ఇటీవలే గౌతమ్ మీనన్ దీని తమిళ వెర్షన్ ను కూడా పూర్తి చేసి విడుదలకు మార్గం సుగమం చేశాడు. ఈ నేపథ్యంలో బజ్ పెంచడం కోసం తెలుగు వెర్షన్ కోసం కొత్త ట్రైలర్ వదులుతున్నారు.

?సాహసం శ్వాసగా సాగిపో? యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం నవంబరు 11న విడుదలవుతుందట. తమిళ వెర్షన్ షూటింగ్ ఈ మధ్యే పూర్తయిపోవడం.. దాని ట్రలైర్ కూడా ఇటీవలే లాంచ్ చేశాడు గౌతమ్. ?సాహసం..? ట్రైలర్ తో పోలిస్తే అది కొంచెం భిన్నంగా ఉంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన సాహసం.. ట్రైలర్ విషయంలో అంత పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. హడావుడిగా కట్ చేసినట్లుగా కనిపించింది ఆ ల్రైటర్. ఈ నేపథ్యంలో రెండో ట్రైలర్ విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టారట. చైతూ సరసన మాంజిమా మోహన్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందించాడు. ఆల్రెడీ ఆడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. కోన వెంకట్ ఈ చిత్రానికి సమర్పకుడు.

,  ,  ,  ,