Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Apr-2017 11:28:52
facebook Twitter Googleplus
Photo

బాహుబలి: ది కంక్లూజన్ టీజర్తో పాటుగా ప్రభాస్ కొత్త సినిమా టీజర్ ప్రదర్శితమవుతుందన్నది చాలా రోజుల ముందు వార్త. ఈ సినిమాకు సాహో అనే టైటిల్ కూడా కన్ఫమ్ అయినట్లు వార్తలొచ్చాయి. కాకపోతే మీడియాలో వార్తలు రావడమే తప్ప.. ఇప్పటిదాకా ఈ టైటిల్ గురించి.. ఈ టీజర్ గురించి అధికారిక సమాచారం ఏమీ లేదు. దీంతో నిజంగా బాహుబలి-2తో పాటుగా ఈ టీజర్ వస్తుందా అన్న సందేహాలు జనాల్లో కొనసాగుతున్నాయి. ఐతే ఎట్టలకేలకు ఆ సందేహాలు తొలగిపోయాయి. ఈ టైటిల్ గురించి.. టీజర్ గురించి చిత్ర నిర్మాతలే అధికారిక సమాచారం ఇచ్చేశారు.

ప్రభాస్ కొత్త సినిమాకు సాహో అనే టైటిల్ కన్ఫమ్ చేస్తున్నట్లు యువి క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. అంతే కాక సాహో టీజర్ ను ఈ నెల 28న బాహుబలి: ది కంక్లూజన్ సినిమాతో పాటుగా ప్రదర్శించనున్నట్లు కూడా వెల్లడించింది. కొన్ని రోజులుగా వార్తలొస్తున్నట్లే హాలీవుడ్ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో విదేశాల్లో ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నట్లు కూడా నిర్మాతలు వంశీ.. ప్రమోద్ తెలిపారు. దీన్ని బట్టి టీజర్ కూడా యాక్షన్ ఓరియెంటెడ్ గా ఉంటుందని తెలుస్తోంది. రన్ రాజా రన్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సంగీత దర్శక త్రయం శంకర్-ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి పని చేస్తున్న సంగతిని కూడా ధ్రువీకరించారు నిర్మాతలు

,  ,  ,  ,  ,