Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Apr-2016 12:10:58
facebook Twitter Googleplus
Photo

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా, బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా, 'పటాస్' సినిమా తో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతోన్న చిత్రం 'సుప్రీమ్'. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణ లో , శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రం వేసవి లో విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ చిత్రం ఆడియో ను ఈ నెల 14న శిల్ప కళా వేదిక లో గ్రాండ్ గా విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధ పడుతోంది. సాయి కార్తీక్ అందించిన పాటలు ప్రేక్షకులను అలరిస్తాయని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

"సుప్రీమ్ చిత్రం అందరినీ అలరించే ఒక మాస్ ఎంటర్టైనర్. సాయి ధరమ్ తేజ్ కి మా బ్యానర్ లో ఇది మూడవ చిత్రం. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాల లాగే ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది. ఏప్రిల్ 14 న ఆడియో విడుదల చేస్తున్నాం", అని శిరీష్ అన్నారు.

దర్శకులు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, "మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక మాస్ చిత్రం ఇది. సాయి ధరమ్ తేజ్ డాన్స్ అండ్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం లో పాటలకు సాయి కార్తీక్ మంచి సంగీతాన్ని అందించారు" అని అన్నారు.

సాయి ధరమ్ తేజ్ , రాశీ ఖన్నా, రాజేంద్ర ప్రసాద్, రవి కిషన్, సాయి కుమార్, పోసాని కృష్ణ మురళి , శ్రీనివాస్ రెడ్డి, మురళీ మోహన్ , రఘు బాబు, జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు



దర్శకత్వం - స్క్రీన్ప్లే - అనిల్ రావిపూడి సినిమాటోగ్రఫీ - సాయి శ్రీరామ్ . ఆర్ట్ - ఏ .ఎస్ ప్రకాష్ - ఎడిటర్ - ఎమ్ అర్ వర్మ . సంగీతం - సాయి కార్తీక్ . నిర్మాత - శిరీష్ . సమర్పకులు - దిల్ రాజు

,  ,  ,  ,  ,  ,  ,