Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

15-Apr-2016 11:32:05
facebook Twitter Googleplus
Photo

ఒక చిన్న స్టోరీలైన్ పెట్టుకొని.. దాని చుట్టూ మసాలా సీన్లతో మాంచి ఎంటర్టయిన్మెంట్ అల్లితే ఎలా ఉంటుంది? అచ్చం ''సుప్రీం'' సినిమాలా ఉంటుంది. అంతకుముందు ''పటాస్'' సినిమా కూడా అంతేగా. అందుకు ఇప్పుడు అదే పద్దతిలో తన రెండో సినిమాను కూడా దర్శకుడు అనిల్ రావిపూడి ఒక మసాలా మూవీగానే డిజైన్ చేశాడు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ఈ సినిమా ఆడియోతో పాటు ఇప్పుడు ట్రైలర్ కూడా విడుదలైంది.

సుప్రీమ్ అంటూ తన కారుకు పేరును పెట్టుకుని.. కారు నడుపుకుంటూ ఉంటాడు మన హీరో. ఎవరైనా వెనకొచ్చి హార్న్ కొడితే మాత్రం వారికి హారర్ సినిమాను చూపిస్తాడు. ఈ మాస్ రోల్ లో సాయధరమ్ అదరగొట్టాడు. ఇకపోతే మన హీరోయిన్ బెల్లం శ్రీదేవి గా.. రాశి ఖన్నా చక్కటి కామెడీ టైమింగ్ తోనే కాకుండా.. ఒక గ్లామర్ క్వీన్ గా కూడా ఆకట్టుకుంది. రేసుగుర్రం రవికిషన్ ఒక మ్యాడ్ విలన్ గా.. జిల్ ఫేం కబీర్ దుహన్ సింగ్ ఒక క్లాస్ విలన్ గా ఆకట్టుకున్నారు. యథావిథిగా అనిల్ రావిపూడి మార్కు కామెడీ ఉంది. ఇక సాయి కార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగనే ఉంది.

మొత్తానికి రొటీన్ ఫార్ములాలోనే ఒక మసాలా ఎంటర్ టైనర్ తీశారని ఈ ట్రైలర్ చూస్తే చెప్పొచ్చు. అయితే 'కమింగ్ సూన్' అన్నారు కాని.. సమ్మర్ లో ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతోంది చెప్పలేదబ్బా!!

,  ,  ,  ,  ,  ,