Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-May-2017 10:16:08
facebook Twitter Googleplus
Photo

ఒక పాపను వెళ్లి వాళ్ళ దేశంలో అప్పజెప్పి రావడం. ఊళ్లో లేని బ్లడ్ బ్యాంక్ ను ఊరికి తీసుకురావడం. పరాయి సైనికుల చెరలో ఉన్న తమ్ముడిని విడిపించుకురావడం. చూస్తుంటే తన స్వస్థలం లో కాకుండా వేరే ప్రదేశంతో ముడిపడిన ఒక పనిని చేస్తున్నట్లు అనిపిస్తోంది కదూ. ఆ మొదటి లైన్లో అల్లిన కథ భజరంగీ బాయిజాన్ అయితే.. రెండవ లైన్లోది సుల్తాన్ సినిమా. మరి 3వ కథ ఏంటనేదే మీ సందేహమా?

ఇప్పుడు బాలీవుడ్ అంతా కూడా బ్లాక్ బస్టర్ ఆల్ ది వే అంటూ జనాలు తెగ ఊహించేసుకుంటున్న ట్యూబ్ లైట్ సినిమా కథ అదేగా. అచ్చం మరో భజరంగీ బాయిజాన్ గా.. మరో సుల్తాన్ లా లేదేటండీ? అయినా మనోడు తీసిన కథలనే ఎన్నిసార్లు తీస్తాడు చెప్పండి? అప్పుడెప్పుడో వార్ లో నుండి ఒక సోల్జర్ ను వెతికి వెనక్కి తీసుకురావడం అనే కాన్సెప్టుపై హాలీవుడ్ ఉద్దండుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ అనే సినిమాను తీశాడు. ఆ స్ర్కీన్ ప్లే మరియు స్టోరీ స్ట్రక్చర్ ను బేస్ చేసుకుని.. ఇప్పుడు మనోళ్ళు పదే పదే అవే కథలు రాస్తున్నారు. అలా రాస్తే పర్లేదు.. ఆ రాసినవన్నీ వరుసగా సల్మాన్ ఖాన్ తోనే తీస్తున్నారు. అదే ఇప్పుడు చిరాకు తెప్పిస్తోంది.

పైగా భజరంగీ బాయిజాన్ సినిమాను తీసిన దర్ఢకుడు కబీర్ ఖాన్ ఇప్పుడు ట్యూబ్ లైట్ తీస్తున్నాడంటే.. రెండు సినిమాలూ ఒకేలా ఉంటాయని ఎవ్వరూ ఊహించరు.

,  ,  ,  ,  ,