Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2017 10:57:53
facebook Twitter Googleplus
Photo

సమంత అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అయిపొయింది. ఏడు సంవత్సరాల కెరీర్ లో గెలుపోటములను లెక్క చేయకుండా తనకు ఇష్టమైన పాత్రలను చేసింది. అయితే ఆమె ఎక్కువగా తన కెరీర్ లో ఎప్పుడు నెగిటివ్ టాక్ తెచ్చుకోలేదు. ఇక మరి కొన్ని గంటల్లో తన మొదటి చిత్రం కథానాయకుడినే తన రియల్ లైఫ్ కథానాయకుడిగా చేసుకోబోతోంది.

అయితే మొదట్లో సమంత తన ప్రేమ గురించి అంత ఎక్కువగా బయట స్పందించేది కాదు. కాని రీసెంట్ గా ఒక లైవ్ చాట్ లో నెటిజన్స్ తో సంబాషించిన ఆమె తన ప్రేమ గురించి ప్రస్తావన రాగానే వెంటనే సమాధానాన్ని ఇచ్చింది. సమంత కి ఎలా తెలిసింది? చైతు తనకి పర్ఫెక్ట్ అని నెటిజెన్ అడుగగా.. సమంత.. మొదటి సారి చూసినప్పుడే కలిగిందని సమాధానాన్ని ఇచ్చింది.

అంటే సమంత ఏ మాయ చేసావే సినిమాలోనే చైతూకి పడిపోయిందా అని అందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సమంత చైతు గత కొన్నేళ్లుగా ఒకరినొకరు అర్ధం చేసుకొని ఫైనల్ గా మరికొన్ని గంటల్లో పెళ్లి చేసుకోబొత్తున్నారు.

,  ,  ,  ,