Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Feb-2017 11:00:10
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో ఏళ్ల తరబడి అత్యంత సీక్రెట్ గా నడిచిన స్టార్ లవ్ స్టోరీ అంటే.. అక్కినేని నాగచైతన్య-సమంతల ప్రేమ కథ గురించి చెప్పాల్సిందే. మనం సినిమాలో వీరిద్దరూ కలిసి తనతో నటించినప్పుడు కూడా.. తనకు ఏ మాత్రం అనుమానం రాలేదని రీసెంట్ గా నాగ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఓపెన్ అయ్యేంత వరకూ అంత సీక్రెసీ పాటించారు ఈ జంట.

ఒకసారి లవ్ స్టోరీ రివీల్ అయ్యాక.. తమ ప్రేమను ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రేమించుకుంటున్న జంటల్లో కూడా.. వీరిద్దరి పేర్లు చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కించేయచ్చు. ఎంగేజ్మెంట్ ముందు వరకు.. 'చెయ్ లవ్' అంటూ స్పెషల్ హ్యాష్ ట్యాగ్ పెట్టి తెగ ట్వీట్స్.. పోస్ట్ లు చేసేది సమంత. ఇప్పుడు ఏకంగా ప్రొఫైల్ లోకే తీసుకొచ్చేసింది. తన లేటెస్ట్ ప్రొఫైల్ పిక్చర్ లో అయితే.. ఎంగేజ్మెంట్ ఫోటోల్లోని మధుర క్షణాలనే చేర్చింది.

ఈ ఫోటోలో లైటింగ్స్ వెలుగు జిలుగుల మధ్య దేవుడికి భక్తితో నమస్కరిస్తున్న సమంత ఒకవైపు కనిపిస్తే.. నవ్వుతూ తన కాబోయే భార్యనే చూస్తున్న సూట్ ధరించిన చైతు మరో వైపు ఉంటాడు. ఇద్దరు భలే చూడముచ్చటగా ఉన్నారులే. ఒకరి లైఫ్ ప్రొఫైల్ లోకే కాదు.. ప్రొఫైల్ పిక్చర్ లోకి కూడా మరొకరు వచ్చేస్తున్నారు.

,  ,  ,  ,  ,  ,