Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Aug-2015 16:30:40
facebook Twitter Googleplus
Photo

ఏమాయ చేశావె చిత్రం తో జెస్సీ గా తెలుగు వారికి పరిచయమైంది సమంత. టాలీవుడ్ కోలీవుడ్ లో టాప్ పొజిషన్ కి చేరుకుంది. మాతృభాష తమిళంలో చాలా కాలం విజయం దోబూచులాడినా తెలుగు లో మాత్రం టాప్ హీరోయిన్ గా పాపులర్ అయ్యింది. సమంత నటిస్తే చాలు హిట్టు కొట్టినట్టే అన్న పేరు తెచ్చుకుంది. అయితే ఇటీవలి కాలంలో కోలీవుడ్ లోనూ సక్సెస్ అందుకుని స్పీడ్ పెంచేసింది. మాతృభాషలో పూర్తి బిజీగా కెరీర్ ని సాగించాలన్న తన కల నెరవేర్చుకుంది.

ఇప్పుడు టైమ్ వచ్చింది కాబట్టి తనదైన మార్క్ తో తంబీల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని చూస్తోంది. ఇప్పటికిప్పుడు అరడజను ప్రాజెక్టు లతో బిజీగా ఉంది. చియాన్ విక్రమ్ సరసన 10 ఎంద్రాతుకుళ్ల అనే చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. విజయ్ మిల్టన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో సినిమా రిలీజ్ కానుంది. ఇటీవలే డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. సొంతంగానే అనువాదం చెప్పుకున్నా. కమ్ కమ్ అక్టోబర్ అంటూ ఎంతో ఆసక్తిని కనబరుస్తోంది సమంత. అంటే తెరపై తనని చూసుకుంటూ సొంత గొంతులో డబ్బింగ్ ఎలా ఉందో పరిశీలించాలన్న ఆత్రం అమ్మడిని నిలవనీయడం లేదన్నమాట!

,  ,  ,  ,