అక్కినేని వారి కొత్త కోడలు సమంత సందడి చేసిన సంగతి తెలిసిందే. తన మరిది సినిమా ప్రమోషన్ కు వదిన హోదాలో వచ్చిన సమంత డ్రెస్సింగ్ పై కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అదే సమయంలో హలో సినిమాలో నిజమైన అఖిల్ కనిపించాడని.... తమకు నిజమైన అఖిల్ ను చూపించినందుకు విక్రమ్ కు థ్యాంక్స్ అని చెప్పడంపై కామెంట్లు కూడా వినబడుతున్నాయి. ఆ వేదికపై తన పెద్ద కొడుకు నాగ చైతన్య గురించి నాగార్జున చెప్పిన మాటలకు వేదికపై ఉన్న వారితో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోయారు. నాగచైతన్యకు ఉన్న మంచి మనసు తనకే కాదని ఎవ్వరికీ లేదని నాగ్ అన్నారు.
అయితే తన భర్త చైతూని నాగ్ పొగుడుతున్నప్పుడు సమంత కళ్లలో నీళ్లు తిరిగాయని చైతూ దొరికినందుకు ఆమె చాలా లక్కీ అని సమంత ట్విట్టర్ ఖాతాలో కామెంట్లు వెల్లువెత్తాయి. ఈ విషయం సామ్ ట్విట్టర్ ఖాతాలో హాట్ టాపిక్ అయింది. దీంతో ఆ విషయం పై సమంత క్లారిటీ ఇచ్చింది. తన మామగారు ...చైతూని పొగుడుతున్న సమయంలో తాను కన్నీరు పెట్టుకోలేదని తన కళ్లకు ఇన్ఫెక్షన్ సోకిందని సమంత ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చింది. Aiyooo lol .. I was having an eye infection....wasn’t crying అని సమంత ట్వీట్ చేసింది. మొత్తానికి సమంత కన్నీళ్ల వెనుక ఉన్న కథ తెలిసిపోవడంతో ఆమె అభిమానులు నాలుక కరుచుకుంటున్నారు.