Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Dec-2017 12:26:03
facebook Twitter Googleplus
Photo

ఒక్కో దర్శకుడికి ఒక్కో టాలెంట్ ఉంది అనే విషయాన్నీ ఒప్పుకొని తీరాల్సిందే. రెగ్యులర్ కమర్షియల్ హంగులను జోడిస్తునే తెరపై ఏదో కొత్త ధనాన్ని చూపించడానికి రెడీ అవుతుంటారు. మరికొందరైతే సినిమా సినిమాకు ఏ మాత్రం సంబంధం లేకుండా కథలో హీరో హీరోయిన్స్ ని చాలా కొత్తగా చూపిస్తుంటారు. ఇప్పుడు దర్శకుడు సుకుమార్ కూడా తన ఆలోచనని సమంత - రామ్ చరణ్ లపై ప్రయోగిస్తున్నాడు.

ఈ దర్శకుడి గత సినిమాలు ఏ తరహాలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న రంగస్థలం సినిమా కూడా చాలా కొత్తగా ఉందని పోస్టర్లే చెబుతున్నాయి. మొన్న రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్లో ఊర మాస్ లుక్కులో కనిపించిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన కొన్ని ఫొటోస్ లలో సమంత మాత్రం ఎవరు కలలో కూడా ఊహించని రేంజ్ లో కనిపిస్తోంది.

విలేజ్ లో పేదింటికి చెందిన అమ్మాయిలు ఎలాంటి పనులు చేస్తారో అలాంటి పనులను చేస్తూ కనిపించింది. గేదెలను తీసుకువస్తూ.. కట్టెల పొయ్యి వద్ద వంట చేస్తూ చాలా కొత్తగా కనిపించింది. దర్శకుడు సుకుమార్ సమంత ని చాలా కష్టపెట్టినట్లు తెలుస్తోంది.

,  ,  ,  ,  ,  ,