Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

12-May-2016 12:12:38
facebook Twitter Googleplus
Photo

సమంత గత కొంత కాలంగా ఫుల్లు బిజిబిజీగా గడిపేస్తోంది. నాలుగు సినిమాల కోసం తెగ కష్టపడిపోయింది. ఈ సమ్మర్ అమ్మడు నటించిన 4 సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తున్నాయి. మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం - నితిన్ తో అ..ఆ.. సమంత టాలీవుడ్ చిత్రాలు కాగా.. విజయ్ తో తెరి - సూర్యతో 24 సినిమాలు సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు క్యూ కట్టాయి. ఇలా 4 భారీ సినిమాలు ఒకే సీజన్ లో విడుదల చేసే రికార్డ్ మరెవరికీ సాధ్యం కాదేమో కానీ.. ఈ ప్రభావం సమంతపై భారీగానే పడింది.

ప్రస్తుతం 24 మూవీ ప్రచారంలో ఉన్న సమంత.. ఆ వెంటనే బ్రహ్మోత్సవానికి పబ్లిసిటీ చేయనుంది కూడా. దాని వెంటే అ..ఆ.. ప్రమోషన్ వర్క్స్ లో కూడా భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది. ఇంత వర్క్ ప్రెజర్ సమంతను బాగా ఒత్తిడికి గురి చేసిందట. అప్పట్లో ఓసారి ఏడ్చేశానని కూడా చెబుతోంది. ఇక 24 సినిమాలో మాదిరిగా కాలాన్ని నిలబెట్టే సాధనం తన దగ్గర ఉంటే.. బ్రహ్మోత్సవం - అ..ఆ.. లు రిలీజ్ అయిన క్షణాలను నిలిపేస్తుందట. అప్పుడు ఆనందం రెట్టింపవుతుంది కదా అంటోంది శామ్స్.

అయితే సమంత ఈ రేంజులో టైమ్ ఫ్రీజ్ చేస్తాను అంటే మాత్రం.. ఇక్కడ అభిమానుల్లో హైప్ పెరిగిపోతోంది. మరీ అంత బీభత్సంగా హైప్ పెంచేస్తే ఎలా సమంత? ఇప్పటికే ఈ సినిమాలపై అంచనాలు బాగానే ఉన్నాయి. కాకపోతే ఇలా అంచనాలు ఎక్కువైనప్పుడే.. అవి మీట్ అయ్యే ఛాన్సులు తగ్గిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలే మాంచి కలెక్షన్లు తెస్తున్నాయి.

,  ,  ,  ,  ,