Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Oct-2016 11:20:33
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ బ్యూటీ సమంత గత కొన్ని నెలలుగా కొత్త సినిమాలు ఒప్పుకోవడంలో మరీ పిసినారి నారిగా మారిపోయింది. ఈ సమ్మర్ లో నాలుగు సినిమాలు రిలీజ్ చేసి.. మూడు మూవీస్ తో హిట్స్ సాధించిన ఈ బ్యూటీ.. అక్కడి నుంచి కొత్త స్టోరీ మొదలుపెట్టింది. రీసెంట్ గా అది క్లైమాక్స్ చేరడం చూస్తూనే ఉన్నాం.

అయితే.. కొత్త సినిమాలు ఒప్పుకోవేంటి సమంతా అంటే మాత్రం.. తన రేంజ్ కి తగ్గ రోల్ రాలేదంటూనే.. కోలీవుడ్ లో విశాల్ కి హీరోగా ఓ సినిమా సైన్ చేయడం తెలుగు ప్రేక్షకులను హర్ట్ చేసేసింది. ఇక తెలుగు సినిమాలు చేయదు కాబోలు అని ఫ్యాన్స్ బెంగ పెట్టేసుకున్నంతలో.. ఇప్పుడో గుడ్ న్యూస్ వినిపించనుందట శామ్స్. తెలుగయినా.. ఇంకో భాషయినా రోల్ నచ్చితే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదంటూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది తరువాత మరోసారి జత కట్టేందుకు ఉత్సాహం చూపుతోందట అ..ఆ.. బ్యూటీ. సమంత కోరుకునే స్థాయి కంటే ఒకింత ఎక్కువగానే ఈ బ్యూటీకి రోల్ ఆఫర్ చేశాడట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

అటు పవన్ సినిమా.. ఇటు త్రివిక్రమ్ డైరెక్షన్.. అన్నిటికీ మించి తన పాత్ర ఇచ్చే సంతృప్తి.. ఎటు తిరిగీ పెద్ద సినిమా కాబట్టి పారితోషికం బాగానే ముట్టచెప్పేస్తారు. ఇక కాదని చెప్పేందుకు సమంతకు కారణం ఏముంటుందిలే?

,  ,  ,  ,  ,