Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jun-2017 15:45:17
facebook Twitter Googleplus
Photo

దక్షిణంలో హీరోయిన్లు గురించి మాట్లాడుకుంటే అందులో ఉండవలిసిన ఒక పేరు సమంత అని ఖచ్చితంగా చెప్పవచ్చు. నాగ చైతన్య తో పెళ్లి కుదిరినప్పటి నుండి సమంత అల్లరి కొంచం ఎక్కువైందనే చెప్పాలి. పెళ్లి కూడా దగ్గర పడుతుంది సినిమాలు కూడా చేయడానికి చాలానే ఉన్నాయి. అక్టోబర్ 6న సమంత - నాగ చైతన్య పెళ్లిచేసుకొని ఒకటి కాబోతున్నారు. దీనికి అందరూ సంతోషిస్తున్నారు కానీ ఇప్పుడు సమంత ఏమి మాట్లాడినా ఎక్కడకు వెళ్ళిన తన నోట నుండి వస్తున్న మొదటి పదం ‘చైతు’.

ఫోటోలు - ముద్దు ముచ్చట ఎవరు తప్పు పట్టరు కానీ మనకు సంబంధం లేని చోట మన గురించి చెబితే కాస్త అందరికీ ఇబ్బంది గానే ఉంటుంది. ప్రేమ మత్తులో ఉన్న సమంత మొన్న ఫిలింఫేర్ అవార్డ్ ఫంక్షన్ కు వెళ్లింది. అక్కడ మైక్ ఇవ్వంగానే సినిమా గురించి తనుకు అవకాశం ఇచ్చిన వాళ్ళు గురించి కాకుండా ‘చైతు’ గురించి తన తదుపరి ఫ్యామిలి ఎలా ఉండబోతుందో మాట్టాడేసిందీ అమ్మడు. అవార్డ్ ఫంక్షన్ లో చైతన్య గురించి ఎందుకు ప్రస్తావించిందో అక్కడ ఎవ్వరికీ అంతుపట్టలేదు. అలాగే రాజమండ్రిలో షూటింగ్ చేస్తూ.. మిస్సింగ్ లవ్ అంటూ పోస్టులు పెడుతోంది. షూటింగులో ఉన్నా కూడా చైతూ గురించే కలవరింత.

ఇక్కడ మాత్రమే కాదు చాల సోషల్ మీడియాల్లో సమంత న్యూస్ లో వస్తుంది అంటే అది కేవలం చైతు విషయంగానే. అతనితో ఉన్న ప్రైవేట్ ఫోటోలు కలిసి తిరుగుతున్న విహారాలు చేస్తున్న వర్క్ ఔట్లు అన్నీ చైతు చుట్టూ ఉండేలా చేస్తుంది. తనకు కాబోయే భర్త గురించి మాట్లాడటం తప్పేమీ కాదుకానీ సందర్భం బట్టి నడుచుకుంటే అందంగా ఉంటుందని కొందరి అభిప్రాయం.

,  ,  ,  ,  ,