Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Feb-2015 11:39:26
facebook Twitter Googleplus
Photo

తక్కువ కాలంలో ఎక్కువ పాప్యులారిటీ తెచ్చుకున్న సంపూర్నేష్ బాబు తనలోని వివిధ కళలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నాడు. ఆ క్రమంలో ఇప్పుడు సింగర్ గా కూడా మారిపోయాడు. ప్రస్తుతం తాను నటిస్తున్న 'కొబ్బరిమట్ట' సినిమాలో ఓ పాట పాడేశాడు. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుందనీ, దీంతో సంపూ ఇమేజ్ మరింత పెరుగుతుందనీ అంటున్నారు. ఈ పాటను త్వరలో యూ ట్యూబ్ ద్వారా విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. పొతే, ఈ 'కొబ్బరిమట్ట'లో మనవాడు ఏకంగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడు అనే మూడు పాత్రల్లో కనిపించి సంపూ ప్రేక్షకులని నవ్విస్తాడట!

,  ,  ,  ,  ,