Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Apr-2017 10:17:25
facebook Twitter Googleplus
Photo

సంపూర్ణేష్ బాబు ఇప్పుడు ఎంత ఫేమస్ అనే విషయం చెప్పాల్సిన పని లేదు. ఒక్క సినిమాతో సోషల్ మీడియా సంచలనం అయిపోయి.. హృదయకాలేయంతో అనూహ్యమైన హిట్ సాధించాడు సంపూ అలియాస్ సంపూర్ణేష్ బాబు. అయితే.. ఇంత సాధించినా తనను చాలామంది బూతులు తిట్టారని చెప్పాడు సంపూ. హీరో కాక ముందు.. బంగారం షాపులో పని చేసేవాడట ఈ హీరో.

ఇప్పటికీ అదే మొబైల్ నెంబర్ ను ఉపయోగిస్తున్నాడట కూడా. అయితే.. హృదయ కాలేయం సినిమా రిలీజ్ అయిన కొత్తలో చాలామంది ఫోన్ చేసి.. నవ్వు హీరో ఏంట్రా అని బండబూతులు తిట్టేవారట. అందుకే .. ఇప్పటికే తనకు తెలియని నెంబర్ వస్తే ఫోన్ ఎత్తనని చెప్పాడు సంపూర్ణేష్ బాబు. ఎంత మంది ఎలా తిట్టినా సైలెంట్ గా ఫోన్ కట్ చేయడం తప్ప అసలు ఎప్పుడూ రియాక్ట్ కాలేదంటున్నాడు సంపూర్ణేష్. అసలు తనకు హృదయ కాలేయం మూవీలో నటించేందుకు ముందే ఇలా తిట్లు తినాల్సి వస్తుందని తెలుసన్నాడు. అప్పట్లో తన పని చేసుకుంటూనే హైద్రాబాద్ వచ్చి వేషాల కోసం ప్రయత్నించేవాడట.

మొదట మహాత్మలో ఓ అవకాశం దక్కగా.. ఆ తర్వాత రాజేష్ పిలిచి.. ఓ చెత్త హీరోని పెట్టి చెత్త సినిమా తీయాలని అనుకుంటున్నానని.. ఆ మూవీ తర్వాత అందరూ తెగ తిట్టుకుంటారని చెప్పి మరీ సినిమా తీశాడట

,  ,  ,  ,  ,