Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Aug-2017 12:36:51
facebook Twitter Googleplus
Photo

తెలుగులో కమర్షియల్ హీరోల సినిమాలతో పాటుగా కామెడీ హీరోల సినిమాలు కూడా వస్తూ ఉంటాయి. ఇది ఇప్పుడిప్పుడు వచ్చిన పద్దతి కాదులెండి. మొదటి తరం హాస్య నటులు రేలంగి - రమణారెడ్డి నుండి వస్తూనే ఉంది. ఆ మధ్యలో ఆలీ - బ్రహ్మానందం ఇప్పుడు ఏమో సునిల్ కామెడీ హీరోలుగా మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే గత కొంత కాలంగా హాస్య నటుడుగా మంచి పేరు తెచ్చుకున్న సప్తగిరి కూడా హీరోగా మారిపోయాడు. తన భాషతో అమాయకపు మాటలుతో అందరిని ఆకట్టుకొన్న ఈ నటుడు సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో కామెడీ హీరోగా మారాడు.

ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు రావడం తో ఆ వెంటనే మరో సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టాడు. ఇప్పుడు చేస్తున్న సినిమా కాకుండా సప్తగిరి మరో సినిమా చేయడానికి సిద్దపడినట్లు తెలుస్తుంది. స్వర్ణ సుబ్బారావు డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాను ఆగష్టు 5 నాడు మొదలుకానుంది. స్వర్ణ సుబ్బా రావు ఇంతకు ముందు విజయేంద్ర వర్మ హరే రామ్ లాంటి సినిమాలును డైరెక్ట్ చేశారు. చాల కాలం తరువాత మళ్ళీ ఆయన ఈ సినిమాతో డైరెక్టర్ గా చేస్తున్నాడు. అసలు మధ్యలో చాలా సినిమాల్లో కమెడియన్ గా కనిపిస్తూనే.. ఇప్పుడు ఇలా హీరోగా కూడా నిలదొక్కుకుంటాడట.

ఇప్పుడు సప్తగిరిని టాలీవుడ్ ఫన్నీ మాన్ అని కూడా పిలుస్తున్నారు. కామిడియన్ గా వచ్చి హీరోలు అయన అతి కొద్ది మంది మాత్రమే అటు హీరోలుగా చేస్తూ ఇటు కామిడీ పాత్రలు చేస్తూ తన కెరియర్ ని చక్కగా మలుచుకోగలిగాడు. ఇప్పుడు స్పీడు మీద ఉన్న ఈ సప్తగిరి ఎలా తన కెరియర్ ని ఎలా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి.

,  ,  ,  ,  ,