Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2016 17:08:50
facebook Twitter Googleplus
Photo

సప్తగిరి.. టాలీవుడ్ లో రీసెంట్ టైమ్ లో సెన్సేషన్ సృష్టించిన కామెడీ యాక్టర్ సప్తగిరి. చాలాకాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. ప్రేమ కథా చిత్రమ్ లో ఈ కమెడియన్ యాక్టింగ్ చూసిన టాలీవుడ్ జనాలు.. తెగ ఆఫర్స్ కురింపించారు. ఆ తర్వాత వరుసగా ప్రతీ సినిమాలు చేసేసే రేంజ్ కి ఎదిగిపోయాడు. సప్తగిరితో ఓ చిన్న రోల్ అయినా చేయించాలని డైరెక్టర్స్ భావించారంటే.. సప్తగిరి ఏ స్టేజ్ కి వెళ్లాడో అర్ధమవుతుంది.

రోజువారి రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి చేరుకున్న ఈ హాస్యనటుడు.. ఇప్పుడు చేజేతులా కష్టాలను కొనితెచ్చుకున్నాడు. సప్తగిరి స్పీడ్ ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయింది. గతేదాది దసరా నుంచి తీసుకుంటే.. బ్రూస్ లీ - రాజు గరి గది - శంకరాభరణం - లోఫర్ - సౌఖ్యం లతోపాటు సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన - ఎక్స్ ప్రెస్ రాజాల్లో కూడా కనిపించాడు. సింపుల్ గా చెప్పాలంటే ఎక్స్ ప్రెస్ రాజా ఇతను నటించిన చివరి సినిమా. ఆ తర్వాత కృష్ణాష్టమిలో కనిపించినా.. ఇది గతంలోనే షూటింగ్ జరుపుకున్న విషయం గుర్తుంచుకోవాలి. సుప్రీమ్ లో చిన్న రోల్ లో మాత్రమే దర్శనమిచ్చాడు.

ఇప్పుడు సప్తగిరికి ఆఫర్ ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు జంకుతున్నారు. ప్రతీ సినిమాలోనూ కనిపించే స్థాయి నుంచి.. చేతిలో ఒక్క మూవీ లేని స్థాయికి పడిపోవడానికి కారణం.. ఇతని బిహేవియర్ అని తెలుస్తోంది. టైం మెయింటెనెన్స్ తో పాటు.. ఇతరులతో ప్రవర్తన విషయంలో దురుసుతనం.. కీడు చేసిందని అంటున్నారు. ఇండస్ట్రీలో జాగ్రత్త పడకపోతే.. సప్తగిరిలా అయిపోతావ్ అనే డైలాగ్ చెప్పుకుంటున్నారంటే.. పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

,  ,  ,  ,  ,