Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Nov-2016 12:12:15
facebook Twitter Googleplus
Photo

సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియో ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ రావడం.. కమెడియన్ నుంచి హీరోగా మారిన సప్తగిరిని విపరీతమైన భావోద్వేగానికి గురి చేసింది. తనను తాను మెగాభిమానిగా చెప్పుకోవడానికి ఏ మాత్రం సందేహించని వ్యక్తి సప్తగిరి. 'నేను నా జీవితంలో మెగాస్టార్ చిరంజీవి మీదా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీదా మాత్రమే పూలు చల్లా' అంటూ గర్వంగా చెప్పేస్తాడు కూడా. అలాంటిది స్వయంగా పవన్ కళ్యాణ్ తన ఆడియో ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా రావడం.. సప్తగిరిని కంట తడి పెట్టించేసింది.

'ఇంత మంది మెగాభిమానుల మధ్య.. ఒక మెగాభిమాని ఆడియో ఫంక్షన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జరుగుతోంది. నా జీవితం నేను ఊహించలేదన్నా' అంటూ పవన్ కాళ్లమీద మీద పడిపోయాడు సప్తగిరి. 'ఇంత వరకూ ఉన్నాయ్ నీళ్లు.. ఆపుకుంటున్నాను' అంటూ తన స్పీచ్ కొనసాగించాడీ కామెడీ హీరో. 'నా జీవితంలో ఎందుకింత మంచిరోజు వచ్చిందని ఆలోచించా. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూస్తూ పెరిగాను.. అభిమానిస్తూ పెరిగాను.. ఆరాధిస్తూ పెరిగాను. నా మనసుతో మెగాస్టార్ చిరంజీ వి గారితో లక్షలసార్లు మాట్లాడాను. నేను ఇంత నిజాయితీ పరుడైన అభిమానిని కాబట్టే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నా ఫంక్షన్ కి వచ్చారు. నేను మాటల్లో చెప్పలేనంతగా రుణపడిపోయా' అన్నాడు సప్తగిరి.

'మీరు ఇందాకటి నుంచి అక్కడ కూర్చుని చిన్న పిల్లాడిలా నవ్వుతుంటే.. నాకు మనసు మొత్తం పవర్ స్టార్ ఆహించేశారు. చిన్న పిల్లాడిలా కనిపించారు. సినిమాల్లో కుర్రాడిలా కనిపిస్తారు. సడెన్ గా ఎవరికో హెల్ప్ చేస్తూ.. గెడ్డం పెంచి. వైట్ అండ్ వైట్ లో మర్యాదస్తుడైన యోగిలా కనపడతారు. రాజకీయ వేదికపై కనిపించినపుడు చరిత్ర సృష్టించే వ్యక్తిలా ఉంటారు. మనం ఇలాంటి వారి గురించి పుస్తకాల్లో చదవడమే.. ఎవర్నీ చూడలేదు. విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి చరిత్ర సృష్టించే వ్యక్తి నా వెనక నిలబడ్డారు.' అంటూ తన సంతోషాన్ని ప్రకటించాడు సప్తగిరి. 'మనసంతా పవర్ స్టార్ ఆవహించేశారు.. ఇంత చిన్న సినిమాను.. కొన్ని కోట్ల రూపాయల వాల్యూ చేసే ఇంత అభిమానాన్ని పంచినందుకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా' అంటూ మరోసారి పవన్ కాళ్లపై సప్తగిరి పడిపోవడంతో.. ఆడిటోరియం అంతా పవర్ స్టార్ నినాదంతో దద్దరిల్లిపోయింది.

'అన్నా.. మీలో ఒకడిని అన్నా.. ఇక్కడికొచ్చానన్నా.. అక్కడ పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిచేది నేనే. మీరు అక్కడున్నారు.. అదృష్టం బాగుండి నేను ఇక్కడికొచ్చానంతే. చిరంజీవి గారి కోసం చొక్కాలు చించుకుని థియేటర్లలో తిరిగిన రోజులన్నాయి. మనసంతా భావోద్వేగంతో నిండిపోయింది. ఆయన ఎనర్జీ మమ్మల్ని అరిపిస్తోంది. అన్నా.. మీకోసం ఎంతదూరం రావడానికైనా.. ఎక్కడి వరకూ అయినా రావడానికి సిద్ధం. మీ పిలుపు కోసం ఈ అభిమాని ఎదురుచూస్తున్నాడు సార్. నా అదృష్టం బాగుండి మెగాస్టార్ గారు టీవీల్లో చూస్తూ ఉంటే.. ఆయనక్కూడా పాదాభివందనం చేస్తున్నాను. మెగాభిమానులు అందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా' అంటూ కన్నీళ్లు పెట్టేసుకున్నాడు సప్తగిరి.

,  ,  ,  ,  ,  ,