Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Apr-2016 11:29:43
facebook Twitter Googleplus
Photo

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ కి తొలిరోజు మార్నింగ్ షోకి ముందే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. మిడ్ నైట్ వేసిన ప్రీమియర్ షోల కారణంగా.. విపరీతంగా టాక్ స్ప్రెడ్ అయింది. పవన్ కెరీర్ లోనే కాదు.. ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఇదొకటి అని తేల్చేశారు.

అయితే సర్దార్ గబ్బర్ సింగ్ వసూళ్లు మాత్రం పవన్ పవర్ ఏంటో చాటి చెబుతున్నాయి. ఓ సినిమాకి 50 కోట్ల వసూళ్లు సాధించడమే మహా ఘనత అని చెప్పుకునే టైం ఇది. అలాంటిది డిజాస్టర్ టాక్ వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ కి ఇప్పటికి వసూలైన మొత్తం 48 కోట్లు దాటింది. థియేటర్ల సంఖ్య కూడా బాగానే ఉండడంతో ఈ వీకెండ్ లో 50 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయమే.

ఒక ఫ్లాప్ మూవీతో 50 కోట్ల మార్కును అందుకుంటున్న ఏకైక హీరోగా పవన్ కళ్యాణ్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. అదే ఈ చిత్రానికి యావరేజ్ టాక్ కానీ హిట్ టాక్ వచ్చుంటే.. టాలీవుడ్ రికార్డులన్నీ బ్రేక్ అయిపోయేవని ఇండస్ట్రీ జనాలు అనుకుంటున్నారు.

,  ,  ,  ,