Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Oct-2017 12:16:32
facebook Twitter Googleplus
Photo

రింగురింగుల జుట్టుతో కనిపించి అందమైన చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంది సీరత్ కపూర్. మొదటి సినిమా బ్రహ్మాండమైన సక్సెస్ సాధించినా రావాల్సిన స్థాయిలో ఆఫర్లు రాలేదు. ఆ తర్వాత తెలుగులో రెండు సినిమాలు చేసినా అవి హిట్ కాకపోవడంతో ఈ సుందరి బాలీవుడ్ కు షిష్టయిపోయిందని అనుకున్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ రాజుగారి గది-2 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది.

ఈ మధ్య సీరత్ చేసిన బికినీ షూట్ బాగానే వైరల్ అయింది. ఆమె టాప్ లెస్ ఫోజులు చూపరులందరికీ హీటెక్కించింది. ఛాన్సుల్లేక సీరత్ తన సెక్సప్పీల్ ప్రపంచానికి చూపేందుకు ఫొటో షూట్ చేస్తోందంటూ కామెంట్లొచ్చాయి. ఇవన్నీ తనను బాగా హర్ట్ చేశాయని అంటోంది సీరత్. ఆ ఫొటో షూట్ ఓ సెపరేట్ కాన్సెప్ట్ తో చేసింది. కొంతమందికే అది అర్ధమైంది. చాలామంది దానిని అర్ధం చేసుకోకుండా నోటికొచ్చిన కామెంట్లల్లా చేశారు. సినిమాల కోసం ఇదంతా చేశాననే మాటల్లో ఎంత మాత్రం నిజం లేదు అని స్పష్టంగా చెప్పింది.

ఈమధ్య నేను హిందీ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చేయడానికి ఇంట్రస్ట్ చూపడం లేదని కొందరు పుకారు పుట్టించారు. దీంతో కొన్ని ఆఫర్లు మిస్సయ్యాయి. అయితే అవేమంత గొప్పవి కాదు కాబట్టి బాధ లేదు. రాజుగారి గది-2 నా కెరీర్ ను టర్న్ తిప్పుతుందని నమ్ముతున్నా అని సీరత్ తన తెలుగు సినిమా ప్లాన్స్ గురించి చెప్పుకొచ్చింది.

,  ,  ,  ,