Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-Jun-2016 13:56:00
facebook Twitter Googleplus
Photo

తన 50వ సినిమాగా మామ మంచు అల్లుడు కంచు చిత్రాన్ని చేసిన అల్లరి నరేష్.. ఆ తర్వాత ప్రాజెక్టుల ఎంపికలో బాగా కేర్ తీసుకున్నాడు. ఇప్పుడు అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న 51వ చిత్రం సెల్ఫీ రాజాకు ఫస్ట్ లుక్ విడుదలైంది. ఇప్పటికే విజయ్ మాల్యాతో తన ఫోటోను కలిపి ట్వీట్ చేసి.. నవ్వులు పూయించిన అల్లరి నరేష్.. ఇప్పుడు అఫీషియల్ గా ఫస్ట్ లుక్ ఇచ్చాడు.

ఓ పెద్ద సిటీ.. ఓ బిల్డింగ్ పై నుంచి ఇంకో బిల్డింగ్ పైకి దూకుతున్న అల్లరోడు ఈ ఫస్ట్ లుక్ లో కనిపిస్తాడు. అలా దూకుతూ కూడా సెల్ఫీ తీసుకోవడం మనోడి స్పెషాలిటీ. సెల్ఫీల కోసం ఏం చేయడానికైనా తెగించేసే కేరక్టర్ అని ఇన్ డైరెక్టుగా చెప్పేశారు. రీసెంట్ గా బాగా పాపులర్ అయిన ఈ కాన్సెప్టుకు.. ఫన్నీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు జీ ఈశ్వర్ రెడ్డి. అల్లరి నరేష్ తో సిద్ధు ఫ్రం శ్రీకాకుళం లాంటి హిట్ ఇచ్చిన తర్వాత.. వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో.. ఆసక్తి నెలకొంది.

కాన్సెప్ట్ బాగానే ఉంది కానీ.. ఫస్ట్ లుక్ చూస్తే మరీ షార్ట్ ఫిలిం టైపులో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వెనక ఓ పెద్ద సిటీకి సంబంధించిన ఔట్ లుక్. మీడియం రేంజ్ గ్రాఫిక్స్ తో మనోడు ఎగురుతున్నట్లుగా ఫోటో.. ఇక సెల్ఫీ రాజా లోగో కూడా యావరేజ్ గానే కనిపిస్తోంది. ఎన్ని యావరేజ్ లున్నా.. అల్లరి నరేష్ ఫాంలోకి వచ్చి రెచ్చిపోతే మాత్రం జనాలు అవేం పట్టించుకోరు లెండి. కాకపోతే సినిమాలో ఆ మేర కంటెంట్ ఉండాలంతే

,  ,  ,  ,  ,  ,