Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

27-May-2017 11:23:52
facebook Twitter Googleplus
Photo

సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ ట్యూబ్ లైట్.. అప్పుడే బాలీవుడ్ లో ఫుల్ హంగామా స్టార్ట్ చేసేసింది. రీసెంట్ గా ట్రైలర్ విడుదల చేసినప్పటి నుంచి టాప్ ట్రెండింగ్ అయిపోయింది సల్లూ భాయ్ ట్యూబ్ లైట్. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఈ ట్యూబ్ లైట్ ఉంటుందని చెప్పకనే చెప్పేశాడు సల్మాన్.

అయితే.. ఈ ట్యూబ్ లైట్ మూవీలో షారూక్ ఖాన్ ఓ కేమియో రోల్ చేస్తున్నాడని ఇప్పటికే చెప్పారు. కానీ కింగ్ ఖాన్ పోషిస్తున్న రోల్ ఏంటనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. అలాగే ట్యూబ్ లైట్ టీజర్ లో షారూక్ ని చూపించినా.. కనీసం గుర్తించేలోపే ఆ ఫ్రేమ్ మాయమైపోతుంది. కానీ ట్రైలర్ లో మాత్రం షారూక్ ఖాన్ ని ఫుల్ గానే చూపించారు. కానీ అది కూడా కొన్ని ఫ్రేమ్స్ మాత్రమే. జస్ట్ ఓ నీడలా మాత్రమే కనిపించేలా బాలీవుడ్ బాద్షా సిల్హౌట్ ను చూపించారు. ఫేస్ చూపించకపోయినా.. అక్కడ ఉన్నది షారూక్ అని గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు.

రెండు చేతులను చాపి తన సిగ్నేచర్ పోజ్ ఇస్తున్నాడు షారూక్. పోజ్ కొంచెం మార్చినంత మాత్రాన కింగ్ ఖాన్ గుర్తించడం కష్టమేమీ కాదు కదా. సల్మాన్ మూవీలో షారూక్ కేమియో అనే న్యూస్ వచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ లో ఆతృత పెరిగిపోయింది. ఇప్పుడు ట్యూబ్ లైట్ ట్రైలర్ లో బాద్షాను చూసి తెగ సంతోషించేస్తున్నారు

,  ,  ,  ,  ,