Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-May-2017 11:16:12
facebook Twitter Googleplus
Photo

నూతన దర్శకుడు చంద్రమోహన్ డైరక్షన్లో ఇప్పుడు రాధ అంటూ మన ముందుకు వస్తున్నాడు కుర్ర హీరో శర్వానంద్. ముఖ్యంగా శతమానం భవతి 30+ కోట్ల హిట్ గా పేరొందాక.. పైగా సినిమాకు నేషనల్ అవార్డ్ కూడా వచ్చాక.. ఇప్పుడు శర్వా స్థాయి కూడా బాగా పెరిగింది. అయితే ఈ ఇమేజ్ తో సంబంధం లేకుండా ఒక పని చేయాలని అనుకుంటున్నాడట మన హీరో. ఏంటది? పదండి చూద్దాం.

నిజానికి చిన్న వయస్సులోనే హీరో అయిపోవడం వలన.. అందులోనూ ఏదో ఒక సినిమాతో వరుసగా బిజీగా ఉండటం వలన.. అసలు టూర్లు కొట్టడం కుదర్లేదట. ఫారిన్ టూర్లు అనేకం వెళ్ళాడు కాని.. ఇండియాలో మాత్రం పెద్గగా తిరగలేదట. అందుకే ఇప్పుడు సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో నాగ చైతన్య తరహాలో మనోడికి వీపున ఒక పెద్ద బ్యాగ్ (బ్యాక్ ప్యాక్) వేసుకుని చక్కగా ముసుగులో ఇండియా అంతా తిరిగి రావాలని ఉందట. అయితే ఈ ఏడాది మారుతితో సినిమా వగైరా వగైరా కమిట్మెంట్లు ఉన్నాయ్. అవి పూర్తవ్వగానే ఎవ్వరికీ చెప్పుకుండా ఏకంగా ఆర్నెలలు పాటు సీక్రెట్ గా జంప్ జిలానీ అయిపోతాను అంటూ శర్వా సెలవిచ్చాడు.

అంతేలేండి.. ఎంత హీరో అయినప్పటికీ.. చక్కగా దేశం అంతా తిరిగి చూద్దాం అని ఎవరికి మాత్రం ఉండదు. అందుకే శర్వా ఇలా ఫీలవుతున్నాడు.

,  ,  ,  ,  ,