Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Nov-2016 13:05:33
facebook Twitter Googleplus
Photo

అప్పట్లో జెమిని టీవీలో సూపర్ హిట్టయిన ?అమృతం? సీరియల్ ను మొదట్నుంచి చూసిన వాళ్లకు ఎస్.ఎస్.కాంచి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమృతరావు బాస్ గా ఆయన పండించిన వినోదం కడుపుబ్బ నవ్వించింది. ఆ తర్వాత రాజమౌళి తీసిన సై.. మర్యాదరామన్న లాంటి సినిమాల్లోనూ తనదైన శైలిలో నవ్వించాడు కాంచి. అతను రాజమౌళికి అన్నయ్య అవుతాడు. కాంచి మంచి నటుడే కాదు.. రచయిత కూడా. ?మర్యాద రామన్న?కు కథ అందించింది ఆయనే. రాజమౌళి సినిమాలు చాలా వాటిలో ఆయన రచనా సహకారం కూడా అందిస్తుంటారని అంటారు.

కాంచి ఈ మధ్యే మెగా ఫోన్ కూడా పట్టేశాడు. ఆయన దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంగా తీస్తున్న సినిమా ?షో టైం?. ఆ మధ్య ఒక ఆసక్తికర టీజర్ ?షో టైమ్? అందరి దృష్టినీ ఆకర్షించింది. సినిమా మొత్తం ఒక థియేటర్లోనే నడవడం.. అక్కడే ముగిసిపోవడం ఈ ?షో టైం? ప్రత్యేకత. చాలా సినిమాల్లో నెగెటివ్.. క్యారెక్టర్ రోల్స్ చేసిన రణధీర్ ఇందులో కథానాయకుడిగా నటించాడు. ఓ కొత్తమ్మాయి హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రానికి రాజమౌళి మరో అన్నయ్య కీరవాణే సంగీతాన్నందిస్తున్నాడు. టీజర్ రిలీయ్యాక మూణ్నాలుగు నెలల పాటు వార్తల్లో లేకుండా పోయిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ చర్చల్లోకి వచ్చింది. ఈ ఆదివారమే ?షో టైం? ఆడియో వేడుక జరగనుంది. రాజమౌళి సహా కొందరు ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతారు. ఈ ఫంక్షన్ ను వెరైటీగా.. ఒక థీమ్ తో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే ?షో టైం? ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

,  ,  ,  ,  ,  ,