Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Sep-2017 14:53:22
facebook Twitter Googleplus
Photo

ప్రభాస్ మ్యానియా ఇప్పుడు మాములుగా లేదు. టాలీవుడ్ లోనే కాకుండా ఇతర బాషల మీడియా వారు కూడా ప్రభాస్ న్యూస్ ను బాగా కవర్ చేస్తున్నారు. సాహో హిందీలో కూడా తెరకెక్కుతుండడంతో బాహుబలి లాగే ప్రభాస్ బాలీవుడ్ లో మారో బాక్స్ ఆఫీస్ హిట్ ని ఈజీగా కొట్టేయగలడని కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఒకేసారి హిందీలో మరియు తెలుగులో తెరకెక్కిస్తుండడంతో సినిమాలోని నటులు కాస్త తెలుగు భాష మీద పట్టు సాదిస్తున్నారట. సాహో లో దర్శకుడు సుజిత్ ఎక్కువగా బాలీవుడ్ నటీనటులనే ఎంచుకోవడంతో సినిమాలో తెలుగు సీన్స్ తీసినప్పుడు ఈజీగా ఉంటుందని తెలుగు నేర్చుకోమన్నాడట.

ముఖ్యంగా ఈ సినిమాతో మొదటి సారి తెలుగు తెరకు పరిచయం కాబోతున్న శ్రద్దా కపూర్ అయితే ఏకంగా కోచింగ్ నే తీసుకుంటోందట. రీసెంట్ గా ఈ విషయాన్ని ఆ ముద్దుగుమ్మనే చెప్పింది. తెలుగు సినిమాలో నటించబోతున్నందుకు చాలా ఎగ్జైటింగ్ గా ఉందని.. తెలుగు కూడా చాలా ఇష్టంగా నేర్చుకుంటున్నాని చెప్పింది. ఇక తాను మొదటి సారి రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నట్లు.. సాహో సినిమా షూటింగ్ లో ఓ వైపు తెలుగు మరో వైపు హిందీ సీన్స్ ఉండడం చాలా ఇంట్రెస్టింగ్ ఉందని తెలుగు బాషా కూడా ఫాంటిస్టిక్ గా ఉందని చెప్పింది. చివరగా ప్రభాస్ గురించి శ్రద్దా ఓ మాటను చెప్పింది.

,  ,  ,  ,  ,