Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-May-2016 15:12:38
facebook Twitter Googleplus
Photo

శ్రియా శరణ్ చేతిలో ఇప్పుడు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా లేదు. గతేడాది టాలీవుడ్ లో గోపాలాగోపాలో- బాలీవుడ్ లో దృశ్యంలతో రెండు హిట్స్ సాధించినా సరే. కెరీర్ ఏ మాత్రం అడుగులు పడలేదు. దీంతో శ్రియ పని ఇక అయిపోయినట్లే అని అంతా అనుకున్నారు. ఇలాంటి టాక్ ఛాన్సుల విషయంలో కనిపించేదేమో కానీ.. జనాల్లో అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది.

హైద్రాబాద్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్ట్ లో శ్రియ శరణ్ సెకండ్ ప్లేస్ లో నిలవడం.. నిజంగా షాక్ అనే చెప్పాలి. 2014లో కూడా శ్రియ రెండో స్థానంలోనే ఉండగా.. ఇప్పుడు కూడా అదే ప్లేస్ ని నిలబెట్టుకోవడం విశేషమే అని చెప్పాలి. దాదాపు 15 ఏళ్లుగా గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న శ్రియ.. ఇప్పటికీ ఆ యాంగిల్ లో ఏ మాత్రం తగ్గడం లేదు. ఎలాంటి డ్రస్ కైనా అడ్రస్ గా నిలవడం.. డ్రెసింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడంతో.. సూపర్బ్ ఫిగర్ శ్రియకు అసెట్ అని చెప్పాలి.

బేసికల్ గా డాన్సర్ అయిన శ్రియ.. ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తుండడంతోనే తన గ్లామర్ ని కాపాడుకుంటోంది. ఏ ఈవెంట్ అయినా సరే శ్రియ డ్యాన్సింగ్ పెర్ఫామెన్స్ లేకుండా జరగదంటేనే అమ్మడి డిమాండ్ అర్ధమవుతుంది. ఇలాంటి ప్లస్ పాయింట్సే.. శ్రియను సెకండ్ ప్లేస్ లో స్థిరంగా ఉంచేశాయి.

,  ,  ,  ,  ,  ,  ,  ,